విషాదం: దేశ రక్షణ కోసం మరో తెలంగాణ జవాన్ బలి

First Published Dec 27, 2020, 9:20 AM IST

దేశసేవ కోసం ఆర్మీలో చేరిన మహబూబ్ నగర్ వాసి పరశురాం తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. 

హైదరాబాద్: దేశ రక్షణ కోసంజమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ నగర్ వాసి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. లడక్ లోని లేహ్ లో ఆర్మీ లో హవల్ధార్ గా పనిచేస్తున్న పరుశురాం డ్యూటీలో వుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ బండల కింద చిక్కుకున్న అతడు అక్కడికక్కడే మరణించాడు.
undefined
మృతుడు పరశురాంది మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వనికుంట తాండ. దేశసేవ కోసం ఆర్మీలో చేరిన అతడు తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. పరుశురాం భౌతిక కాయానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు.
undefined
గురువారం లేహ్ లో పరశురాం విధుల్లో వుండగా కొండచరియలు విరిగిపడి మరణించారని ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం సేవలను మంత్రి కీర్తించారు.
undefined
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు మహబూబ్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పరుశురాం కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పరుశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.వీటితో పాటు సైనిక సంక్షేమ నిధి నుండి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తామన్నారు.
undefined
కేంద్ర ప్రభుత్వం కూడా పరుశురాం కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి పరుశురాం కుటుంబానికి అండగా ఉంటామన్నారు.గతంలో చైనా దురాక్రమణలో అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని అదుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పరుశురాం భౌతిక కాయానికి సైనిక అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు.
undefined
click me!