Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్

Published : May 19, 2026, 09:15 AM IST

Weather Update Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా కదులుతున్నాయి.

PREV
15
పగలు సెగలు.. సాయంత్రం వానలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మండుతున్న ఎండలకు, ఉక్కపోతకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి టైంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రజలకు ఒక క్రేజీ కూల్ అప్‌డేట్ ఇచ్చింది. 

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు, మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఎండ వేడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించనున్నా, వానతో పాటు వచ్చే ఈదురు గాలులతో కాస్త అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది.

25
ముందస్తుగా దూసుకొస్తున్న నైరుతీ రుతుపవనాలు

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈసారి నైరుతీ రుతుపవనాలు చాలా జోరుగా కదులుతున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రం, కామోరిన్ ఏరియాలోకి ఇవి అనుకున్న సమయం కంటే ముందే ఎంట్రీ ఇచ్చేశాయి. బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల మొత్తాన్ని ఇవి కమ్మేశాయి.

రానున్న 3, 4 రోజుల్లో ఇవి మరింత విస్తరించి కోస్తాంధ్ర వైపు దూసుకురానున్నాయి. మే 26 నాటికల్లా ఇవి కేరళను తాకుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. రుతుపవనాల రాకకంటే ముందే ఇలాంటి వర్షాలు పడటం ఒక మంచి పరిణామంగా వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

35
మారిన వాతావరణం

దక్షిణ తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్‌పై ఒక బలమైన ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టం నుంచి దాదాపు 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు దట్టంగా అల్లుకుపోయాయి. శాటిలైట్ డేటా ప్రకారం.. ఏపీ, తెలంగాణలపై ఒక పెద్ద గాలి సుడి తిరుగుతోంది. 

దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజియన్లలో ఉదయం నుంచి మేఘాలు పరుగులు పెడుతూ ఉక్కపోతను పెంచుతాయి. అయితే, మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీన్ మారుతుంది. విశాఖ, ఉత్తరాంధ్రలో మోస్తరు వానలు పడతాయి. రాయలసీమలో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

45
తెలంగాణలో సాయంత్రం వేళల్లో చల్లని వాతావరణం

తెలంగాణ విషయానికి వస్తే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతుంది. కానీ, సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణం కూల్ అవుతుంది. 

నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు పడతాయి. రాత్రి 9 గంటల వరకు ఈ వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉంది.

55
ఈదురు గాలులు.. ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు

ప్రస్తుతం కురిసే వానల కంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలుల వల్లే ప్రమాదం ఎక్కువ అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో గాలి వేగం 53 కిలోమీటర్ల వరకు ఉండటం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లడం ఏమాత్రం క్షేమకరం కాదు. 

అలాగే, ఈ తాత్కాలిక ఉపశమనం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది. మే 21 నుంచి మళ్లీ ఎండలు పీక్స్‌కు చేరుతాయని, వడగాలుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. కాబట్టి పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కూలీలు మధ్యాహ్నం పూట జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Read more Photos on
click me!

Recommended Stories