School Holidays : రేపు ఒక్కరోజే స్కూళ్లు నడిచేది... ఏపీలో రెండ్రోజులే, తెలంగాణలో మాత్రం మూడ్రోజులు సెలవులేనా?

Published : Jul 10, 2025, 01:30 PM IST

జులైలో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకే కాదు ఉద్యోగులకు కూడా వరుస సెలవులు వస్తున్నాయి. ఈ శని, ఆదివారం రెండ్రోజుల సెలవులు ఫిక్స్.. మరి సోమవారం కూడా అక్కడి విద్యార్థులకు సెలవుంటుందా? 

PREV
16
తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు

Holidays : సెలవులు... ఈ మాట వింటేచాలు విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఎగిరి గంతేస్తారు. సాధారణంగా ప్రతి ఆదివారం వచ్చే సెలవుకోసమే ఎదురుచూస్తుంటారు... అలాంటిది ఏదయినా పండక్కో, పర్వదినానికో పబ్లిక్ హాలిడ్ వచ్చిందంటే వారి ఆనందానికి అవధులుండవు. వారం మధ్యలో వచ్చే హాలిడేకే మురిసిపోయేవారికి ఆదివారంతో మరిన్ని సెలవులు కలిసివచ్చి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారితే... ఆ ఆనందాన్ని వర్ణించలేం. అలాంటి లాంగ్ వీకెండ్ ఈ వారం తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వస్తోంది.

26
ఈ శని, ఆదివారం సెలవు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఆదివారం విద్యాసంస్థలకే కాదు ఉద్యోగులకు సాధారణ సెలవు ఉంటుంది. అయితే ప్రతినెలా తప్పనిసరిగా ఓవారంలో రెండ్రోజులు సెలవులు వస్తాయి. ఈ నెల(జులై)లో అది ఈ వారమే. రేపు (జులై 11, శుక్రవారం) ఒక్కరోజే ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు నడిచేది... తర్వాతి రెండ్రోజులు సెలవులే. 

జులై 12న రెండో శనివారం సందర్భంగా విద్యాసంస్థలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. తర్వాతిరోజు జులై 13 ఆదివారమే కాబట్టి ఎలాగూ సెలవు. ఇలా ఈవారాంతంలో వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి.

36
ఈ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా రెండ్రోజులు సెలవులే...

ఇక హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవే. అలాగే బ్యాంక్ ఉద్యోగులకు కూడా ప్రతి రెండు, నాలుగో శనివారం సెలవు. ఇలా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకే కాదు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈవారం రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. 

46
సికింద్రాబాద్ బోనాలకు సెలవు ఉంటుందా?

హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఈ ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆడపడుచులు అందంగా ముస్తాబై బోనమెత్తగా... పురుషులు మేకలు, కోళ్లను బలిచ్చి విందు, మందుతో సందడిచేస్తారు. డప్పుచప్పుళ్లు, పోతురాజులు, శివసత్తులు నృత్యాలు, పలహారం బండ్ల ఊరేగింపు, నగర నలుమూలల నుండి వచ్చే భక్తులతో సికింద్రాబాద్ ప్రాంతమంతా  సందడిగా, రద్దీగా మారిపోతుంది.

ఇలా ఈ బోనాల వేడుకలు రెండ్రోజులపాటు కొనసాగుతాయి. కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈ సెలవుపై విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అధికారిక ప్రకటన వెలువడితేనే సోమవారం సెలవు ఉన్నట్లని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలి.

56
బోనాల పండక్కి సెలవు ఎప్పుడంటే...

ఆషాడమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల వేడుకలు జరుగుతాయి… కానీ హైదరాబాద్ లో జరిగే బోనాలు హైలైట్ గా నిలుస్తాయి. ఈ బోనాల పండగ కేవలం తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది... ఇక్కడి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ఈ వేడుకలు తెలియజేస్తాయి. అందుకే ప్రభుత్వం ఈ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

ఈసారి హైదరాబాద్ బోనాలు ఆషాడమాసంలో చివరి ఆదివారం అంటే జులై 20న జరగనుంది. అందుకే ఆ తర్వాతిరోజు అంటే జులై 21ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది. ఈ సెలవు తెలంగాణవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, ఉద్యోగులకు వర్తిస్తుంది.

66
తెలంగాణలో ఈ సెలవులు ఎక్స్ట్రా...

తెలంగాణలో ఈ శని, ఆదివారం సెలవు పక్కా... సోమవారం మాత్రం కేవలం సికింద్రాబాద్ ప్రాంతంలో సెలవుండే అవకాశాలున్నాయి... కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రెండో శనివారం, ఆదివారం (జులై 12,13) మాత్రమే సెలవు ఉంటుంది. ఇక జులై 21న కూడా కేవలం తెలంగాణలో మాత్రమే సెలవు... ఏపీలో బోనాలు వేడుకలుండవు కాబట్టి సెలవు ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories