అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు హైదరాబాద్ లో ఘనస్వాగతం...

First Published | Apr 14, 2023, 11:05 AM IST

బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలకు ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ వచ్చారు. ఆయనకు మంత్రి గంగుల కమలాకర్ ఘన స్వాగతం పలికారు. 

హైదరాబాద్ : భారతరత్న, బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు సర్వం సిద్దమైంది, సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ వేడుకలకు ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్ విచ్చేశారు. ఆయనను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా స్వాగతించారు. 

ప్రకాశ్ అంబేద్కర్ కు శాలువా కప్పి సన్మానించి దళితబందు జ్ణాపికను అందజేసారు. నేడు హుజురాబాద్లో దళితబందు లబ్దిదారులను కలిసి వారి అనుభవాలను, దళితబందు ద్వారా వారి జీవితాల్లో వచ్చిన సమూల మార్పుల గురించి ప్రకాష్ అంబేద్కర్ తెలుసుకోనున్నారు. మంత్రి గంగులతో పాటు, విప్ బాల్క సుమన్ ఇతర ఉన్నతాధికారులు ప్రకాష్ అంబేద్కర్ ని హుజురాబాద్ దళితబందు లబ్దీదారుల వద్దకు తీసుకొని వెళ్తారు. పర్యటన అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.


గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రకాశ్ అంబేద్కర్ తో మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు మంత్రి గంగుల కమలాకర్, విప్ బాల్కా సుమన్ పాల్గొన్నారు. 

Latest Videos

click me!