కొత్త సచివాలయంలో సిద్ధమైన మంత్రుల ఛాంబర్లు.. పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

First Published | Apr 13, 2023, 1:13 PM IST

తెలంగాణలోని కొత్త సచివాలయంలో మంత్రలు ఛాంబర్లు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ రోజు పనులను పరిశీలించారు. 
 

హైదరాబాద్ : ప్రపంచమే అబ్బుర పడేలా తెలంగాణ ప్రతీకగా నూతన సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల  శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అధికారులు, ఉద్యోగుల కోసం ఆహ్లాద భరితమైన విశాలమైన గదులు, ఛాంబర్లు, వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

సచివాలయ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్​ను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి సచివాలయ ప్రాంగణమంతా తిరిగారు. పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

Latest Videos


కాగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ కొత్త సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. సుమారు 2500 మంది ప్ర‌ముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇటీవల  ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త స‌చివాల‌యంలో మొత్తం తిరిగారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. 

సచివాలయం ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే మొదట సీఎం కేసీఆర్ తన చాంబర్ లో కూర్చుంటారు. ఆ తరువాత రం మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో సిబ్బంది, ఇతర సచివాలయ సిబ్బంది తమ చాంబర్లలలోకి ప్ర‌వేశించ‌నున్నారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొంటార‌ని స‌మాచారం. 

తెలంగాణ నూత‌న స‌చివాల‌యంలో వికలాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రికల్ వాహనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సెక్రటేరియట్ లోకి ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ప్ర‌యివేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. సెక్రటేరియట్ భద్రతకు సంబంధించి డీజీపీ విధివిధానాలను రూపొందించి భద్రతా చర్యలు తీసుకుంటారని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి.

click me!