వాక్పటిమ ప్రదర్శించింది.. చిన్నపిల్లలా ప్రవర్తించింది.. కవిత ప్రకటనపై సుఖేష్ లాయర్ స్ట్రాంగ్ కౌంటర్..

Published : Apr 14, 2023, 07:06 AM IST

సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదంటూ కవిత చేసిన ప్రకటన మీద ఆయన లాయర్ అనంత్ మాలిక్ తీవ్రంగా స్పందించారు. చిన్నపిల్లల వ్యవహారంలా ఉందంటూ విమర్శించారు. 

PREV
15
వాక్పటిమ ప్రదర్శించింది.. చిన్నపిల్లలా ప్రవర్తించింది.. కవిత ప్రకటనపై సుఖేష్ లాయర్ స్ట్రాంగ్ కౌంటర్..

హైదరాబాద్ : కాలుకు ఫ్రాక్చర్ అయి మూడు వారాల విశ్రాంతిలో ఉన్న ఎమ్మెల్సీ కవిత నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ల మధ్య వాట్సప్ చాట్ జరిగిందని ఆ స్క్రీన్ షాట్లు బయటికి రావడంతో మరోసారి సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే దీని మీద  కల్వకుంట్ల కవిత, సుఖేష్ చంద్రశేఖర్ లాయర్ల మధ్య వాట్సప్ షాట్ల వార్ నడుస్తోంది. బుధవారం సుఖేష్ తో కవిత సంభాషణ స్క్రీన్ షాట్లను  రిలీజ్ చేయడంతో స్వయంగా కవితే ఓ ప్రకటన రూపంలో వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సుఖేష్ ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చారు.  

25

‘గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ మీద, ముఖ్యంగా నా మీద కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు పచారం చేస్తున్నాయి. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సుఖేష్ ఎవరో నాకు తెలియదు. ఆయనతో నాకేంటి పని. వాస్తవాలు పట్టించుకోకుండా.. అత్యుత్సాహంతో కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇలాగే చేశాయి. తరువాత నోరు మూసుకున్నాయి. ఇప్పుడు క్రిమినల్ అయిన సుఖేష్ ను పావుగా వాడుకుంటున్నాయి. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయి. దమ్ముంటే, నిజాయితీ గా ఉంటే నా ఈ వివరణకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి..’ అంటూ ప్రకటన చేశారు.

35

దీనిమీద సుకేష్ చంద్రశేఖర్ లాయర్ అనంత్ మాలిక్  స్పందించారు. ఇప్పుడు ఆయన స్పందన చర్చనీయాంశంగా మారింది. అనంత్ మాలిక్ ఏమన్నారంటే… ‘నా క్లయింట్ సుకేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్లు విడుదల చేయడం, ఆయన వాంగ్మూలం అన్నీ నిజాలే. ఈ నిజాల మీద కవిత  స్పందించిన తీరు, ప్రకటన చేసిన తీరు చిన్న పిల్లల్లా ఉంది. అనేక డిజిటల్ సాక్షాలను  సుఖేష్ చంద్రశేఖర్  తన వాదనలకు మద్దతుగా అందించారు.  

45

దీంతో పాటు  తన వాంగ్మూలాన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్ 65 బి ప్రకారం జత చేశాడు. కవిత ఈ విషయంలో న్యాయపరమైన విచారణను స్వాగతించాలి. కానీ, దానికి బదులు ఆమె చిన్నపిల్లలా మాట్లాడింది. దీంతో దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి  కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. అనుభవజ్ఞుడైన, నికార్సైన,  న్యాయమైన రాజకీయ నేత ఎవరైనా సరే ఇలాంటి విషయాలు ఎదురైనప్పుడు విచారణను స్వాగతిస్తారు.

55

అలా చేయడం వల్ల అసలు నిజం బయటపడుతుంది. కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఏజెన్సీల నుంచి దాగుడుమూతలు ఆడినట్లుగా ఉంటుంది. మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్ లాగా తన తన వాక్పటిమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ విషయం మామూలు ప్రజలలో ప్రజాదరణ పోటీకి సంబంధించింది కాదు. ప్రత్యేక ఏజెన్సీల ప్రత్యేక పరిశోధనకు సంబంధించింది. ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటనపై నా క్లయింట్ తో ఈ వారంలోనే ప్రతిస్పందన అందుతుంది’ అని కవితకు అనంత్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories