తెలుగు రైతులకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10 కోట్ల వరకు వడ్డీలేకుండా రుణాలు అందించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
వ్యవసాయ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశం ప్రయత్నిస్తోంది… ఇందులో భాగంగానే ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కూరగాయలు, పండ్లను ఎగుమతి చేస్తోంది. అధిక దిగుబడి సాధించేలా చర్యలు తీసుకోవడమే కాదు పంటలను నిల్వ ఉంచుకునేందుకు సహకరిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా రైతులకు రుణ సహాయం అందిస్తున్నాయి. రైతులకు అందించే రుణాలపై వడ్డీ తక్కువగా ఉండటం వల్ల గ్రామీణ చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతున్నారు.
26
రైతు సంఘాలకు ఆర్థికసాయం
ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కూడా దేశ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (Farmer Producer Organization) అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ బ్యాంక్ కీలక చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల చాలా మంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని విలువైన ఉత్పత్తులుగా మార్చి అమ్ముకుంటున్నారు.
36
రూ.10 కోట్ల రుణం ఎందుకు ఇస్తారు?
FPO ఆర్థిక సహాయం పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద అమలు చేయబడుతోంది. ఈ పథకం ప్రకారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు (SHG), వ్యవసాయ సంబంధిత సంస్థలు కింది కార్యకలాపాల కోసం రుణ సహాయం పొందవచ్చు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రకటించిన ప్రకారం ఒక FPOకి రూ.10 కోట్ల వరకు రుణ సహాయం అందించబడుతుంది. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రభుత్వం వడ్డీ నష్టాన్ని సబ్సిడీగా అందిస్తుంది.
వడ్డీ రేటు, కాలపరిమితి
వడ్డీ సబ్సిడీ: సంవత్సరానికి 3% వరకు సబ్సిడీ అందించబడుతుంది. రుణ మొత్తం తిరిగి చెల్లించే కాలపరిమితి గరిష్టంగా 7 సంవత్సరాలు.
మారటోరియం కాలం: 1 నుండి 2 సంవత్సరాల వరకు
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
నమోదిత రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు)
ఎక్కువగా రైతులచే నిర్వహించబడే సహకార సంఘాలు
సమూహ సంస్థలు
56
రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
FPO నమోదు కాపీ, కార్యాచరణ నివేదికలు, వాటాదారుల వివరాలను సిద్ధం చేయాలి
బ్యాంక్ శాఖను నేరుగా సందర్శించి వ్యవసాయ సంబంధిత ప్రాజెక్ట్ నివేదికను సమర్పించాలి
బ్యాంక్ అధికారులు పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేయబడుతుంది
ఈ పథకం, వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా మార్చే ఒక ముఖ్యమైన ప్రయత్నం అని… FPOలకు అందించబడే ఆర్థిక సహాయం ఆధునిక వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ఆదాయాన్ని పెంచుతుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.
66
ఈ పథకంతో రైతులకు లాభాలు
వ్యవసాయ ఆదాయం పెరుగుతుంది
మధ్యవర్తులను నివారించి ప్రత్యక్ష మార్కెట్లో ఉత్పత్తులను అమ్ముకోవచ్చు
గ్రామీణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి
ఉత్పత్తి వృధా కాకుండా కాపాడుకోవచ్చు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ ఆమోదయోగ్యమైన ఆర్థిక పథకం, భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.