గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. 10 లక్షలకు పెంచారు. అలాగే ఆరోగ్య శ్రీ సేవ పరిధిలోకి 163 వైద్య చికిత్సలను యాడ్ చేశారు. దీంతో ప్రస్తుతం మొత్తం 1835 చికిత్సలు ఈ పథకం ద్వారా లభిస్తున్నాయి.
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ సేవలను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. అయితే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంతకీ ఏయే ఆసపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..