టీఆర్ఎస్‌లోకి నామా: తుమ్మల భవిష్యత్ ఏమిటి?

First Published Mar 19, 2019, 3:56 PM IST

ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడ అదే పార్టీలో కొనసాగుతున్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడ అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఖమ్మం నుండి నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదు.
undefined
ఖమ్మం జిల్లా టీడీపీలో నామా నాగేశ్వర్ రావు, తుమ్మల నాగేశ్వర్ రావు కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసిన సమయం నుండి తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీలో ఉన్నారు.
undefined
2004 ఎన్నికలకు ముందు నామా నాగేశ్వరరావు టీడీపీలో చేరారు. ఖమ్మం జిల్లా టీడీపీ రాజకీయాల్లో వీరిద్దరూ కూడ కీలకంగా వ్యవహరించారు.ఖమ్మం జిల్లా టీడీపీలో నామా నాగేశ్వర్ రావు చేరిన తర్వాత పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఓ గ్రూపుకు తుమ్మల నాగేశ్వర్ రావు నేతృత్వం వహిస్తే మరో గ్రూపుకు నామా నాగేశ్వర్ రావు నాయకత్వం వహించేవాడు.
undefined
ఈ ఇద్దరు నేతల మధ్య కూడ సయోధ్య లేదు. ఎన్నికల సమయంలో తమ గ్రూపుకు చెందిన అభ్యర్థులకు టిక్కెట్లను ఇప్పించుకొనేందుకు వీరిద్దరూ కూడ చంద్రబాబునాయుడు వద్ద పట్టుబట్టేవారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వర్ రావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
undefined
ఆ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వర్ రావు భావించారు.
undefined
కానీ, ఆ ఎన్నికల్లో పాలేరు నుండి నామా నాగేశ్వర్ రావుత తన అనుచరురాలిగా ముద్రపడిన ఎంబీ స్వర్ణకుమారికి టిక్కెట్టు ఇప్పించారు. దీంతో తుమ్మల నాగేశ్వర్ రావు అనివార్యంగా ఖమ్మం అసెంబ్లీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఖమ్మం ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన నామా నాగేశ్వర్ రావు కూడ ఓటమి పాలయ్యారు.
undefined
సత్తుపల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా సండ్ర వెంకటవీరయ్య మాత్రమే విజయం సాధించారు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీల పునరేకీకకరణ కోసం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను బలోపేతం చేసే ఉద్దేశ్యంతో తుమ్మల నాగేశ్వర్ రావును కేసీఆర్ టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు.
undefined
ఆ సమయంలో ఖమ్మం జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌గా ఉన్న కవిత సహా తుమ్మల నాగేశ్వర్ రావు వర్గీయులంతా టీఆర్ఎస్‌ గూటికి చేరారు దీంతో కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తుమ్మల నాగేశ్వర్ రావును తీసుకొన్నారు. రోడ్లు, భవనాల శాఖమంత్రిగా తుమ్మల నాగేశ్వర్ రావు పనిచేశారు.
undefined
తుమ్మల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలానికే పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతతో మృతి చెందాడు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరు నుండి భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలోనే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. పువ్వాడ అజయ్ టీఆర్ఎస్‌లో చేరడం వెనుక తుమ్మల కీలకంగా వ్యవహరించారు.
undefined
2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయపరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్ కూటమి అత్యధిక సీట్లను కైవసం చేసుకొంది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలోనే టీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఓటమి పాలు కావడానికి పార్టీలోని గ్రూపు తగాదాలే కారణమని కేసీఆర్ గుర్తించాడు. పాలేరు ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీలో విజయం సాధించిన తుమ్మల నాగేశ్వర్‌ రావు కూడ కాంగ్రెస్ అభ్యర్ధి కందాళ ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.
undefined
ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓటమి పాలు కావడానికి కారణమైన కొందరు నేతలను కేసీఆర్ గుర్తించాడు. వారికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగానే నామా నాగేశ్వర్ రావుకు కేసీఆర్‌ వల వేశారు.
undefined
ఖమ్మం ఎంపీ సీటును ఈ ఎన్నికల్లో కైవసం చేసుకొనేందుకు గాను విపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొంటున్నారు. ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన హరిప్రియానాయక్,సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.వైరా నుండి ఇండిపెండెంట్‌గా గెలిచిన రాములునాయక్‌ టీఆర్ఎస్‌లో చేరారు.
undefined
గత ఏడాది డిసెంబర్ లో ఖమ్మం అసెంబ్లీ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నామా నాగేశ్వర్ రావు ఓటమి పాలయ్యాడు. మంగళవారం నాడు నామా నాగేశ్వర్ రావు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఖమ్మం నుండి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా నామా నాగేశ్వర్ రావు బరిలోకి దిగనున్నారు.
undefined
నామాను టీఆర్ఎస్‌లోకి తీసుకురావడం ద్వారా రాజకీయంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
undefined
తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పటికే ఓటమి పాలయ్యాడు. నామా ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే టీఆర్ఎస్‌లో నామా పై చేయి సాధించే అవకాశం లేకపోలేదు. మరో వైపు వీరిద్దరి మధ్య టీడీపీలో ఆధిపత్య పోరు సాగింది. టీఆర్ఎస్‌లో కూడ అలాంటి పరిస్థితే ఉంటుందా... కలిసిపోతారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
undefined
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాకుండా నామా నాగేశ్వర్ రావును బరిలోకి దింపడం ద్వారా రాజకీయంగా కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
click me!