టీఆర్ఎస్ పార్టీ బి-టీమే... కానీ బిజెపి, కాంగ్రెస్‌లకు కాదు: కవిత

Published : Mar 15, 2019, 04:48 PM ISTUpdated : Mar 15, 2019, 04:50 PM IST

గతంలో అసెంబ్లీ, ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను నిజామాబాద్ ఎంపీ  కల్వకుంట కవిత మరోసారి తిప్పికొట్టారు. తెలంగాణ ప్రజలు కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలమని చెప్పుకునే బిజెపి, కాంగ్రెస్ లను మాకొద్దంటూ తిరస్కరించినా వారి తీరులో మార్పు రావడం లేదన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీకంటే మీకు బీ-టీమ్ అని బిజెపి, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. అయితే టీఆర్ఎస్ నిజంగానే బి-టీమ్ అని...కానీ వారంటున్నట్లు ఏదో పార్టీకి కాదని తెలంగాణ ప్రజలకు బి - టీమ్ అని కవిత పేర్కొన్నారు. 

PREV
17

27
లోక సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19న నిజామాబాద్‌లో తలపెట్టిన సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై ఆమె జిల్లా నాయకులతో చర్చించారు. ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ...దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు... లోకల్ పార్టీలు ముద్దు అనే అభిప్రాయానికి వచ్చారన్నారు. జాతీయ పార్టీలకు దేశానికి సంబంధించిన విషయాలు, అంతర్జాతీయ అంశాలతో పాటు చాలా విషయాలపై దృష్టి పెట్టాల్సి వుంటుందని....కానీ ప్రాంతీయ పార్టీలకు కేవలం రాష్ట్ర పాలనే ప్రధానాశంగా వుంటుందన్నారు. అందువల్లే దేశంలో స్థానిక పార్టీల ప్రభావం పెరుగుతోందని...తెలంగాణ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రాభల్యం ఈ లోక్ సభ ఎన్నికల్లో మరింత పెరగుతుందని కవిత అన్నారు.

37
కేంద్రంలో అధికారంలో వున్న బిజెపితో విభజన హామీలపై టీఆర్ఎస్ ఎంపీలమంతా కలిసి కొట్లాడామని కవిత గుర్తుచేశారు. ముఖ్యంగా నూతన రాష్ట్రంలో ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు తక్కువగా ఉంటే ఆ సంఖ్య పెంచమని కేంద్రం చుట్టూ తిరిగామన్నారు. అలాగే హామీల్లో భాగమైన ఎయిమ్స్, నిజామాబాద్ రైల్వే లైన్ కోసం నిధులను ను ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నామని కవిత వెల్లడించారు.

47
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ దొందూ దొందేనని కవిత విమర్శించారు.. అవి రెండూ నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివన్నారు. దేశానికి, తెలంగాణకు వాళ్ళు చేసిందేమీ లేదు... కాబట్టే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మందిరం,మసీద్, బోఫోర్స్, రాఫెల్ అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారని తెలిపారు. తమను మరోసారి ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే...తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాతమని పేర్కొన్నారు. ఇప్పుడు 16 టీఆర్ఎస్ 1 ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే సైనికుల్లా పనిచేస్తామని కవిత హామీ ఇచ్చారు .

57
గతంలో ఇద్దరు జేడీఎస్ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. అదే మాదిరిగా ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల జాతీయ రాజకీయాల్లో పెడరల్ ప్రంట్ ప్రధాన భూమిక పోషించనుందని... సరైన మార్గంలో నడిపించడాని దేశానికి కేసిఆర్ లీడర్‌షిప్ అవసరమన్నారు. కేసిఆర్ కు విజన్, దార్శనికత ఉన్నాయని కవిత పేర్కొన్నారు.

67
గత తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన షి టీమ్స్, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలోని ఏడెనిమిది రాష్ట్రాలు ప్రస్తుతం రైతు బందును అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పథకాన్ని కాఫీ చేసి కిసాన్ సమ్మాన్ పేరుతో ఎన్నికల ముందు కేంద్రం ప్రకటించడం రైతులను మోసం చేయడమేనని కవిత పేర్కొన్నారు.

77
రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు సొంత పార్టీలా భావించే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కవిత కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 19న నిజామాబాద్ లో జరిగే సీఎం బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. మద్యాహ్నం ఎండ తీవ్రత దృష్ట్యా సభను సాయంత్రం నిర్వహిస్తున్నామని..అందుకోసం అన్నీ ఏర్పాట్లు చేశామని కవిత వివరించారు.

click me!

Recommended Stories