లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనైన ఎంపీ కవిత

First Published Mar 18, 2019, 8:25 PM IST

తెలంగాణ లో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కీలక పాత్ర పోషించనుందని ఆమె ధీమా  వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె  జగిత్యాల , నిజామాబాద్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ లో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కీలక పాత్ర పోషించనుందని ఆమె ధీమా  వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె  జగిత్యాల , నిజామాబాద్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు.
undefined
నిజామాబాద్ ఎంపీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో పలు కుల సంఘాల నాయకులు కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆమెకే మద్దతిస్తామని ప్రకటించాయి. కేవలం నిజామాబాద్ లోనే కాదు జగిత్యాల, కోరుట్ల లో కూడా పలు కుల, వృత్తి సంఘాలవారు ఎంపీకి మద్దతు ప్రకటించారు. ఈ సంర్భంగా ఎన్నికల ఖర్చు కోసం 5 లక్షల 77 వేల 624 రూపాయలను కవితకు విరాళం గా అందజేశారు.
undefined
ముఖ్యంగా లక్ష్మి పూర్ గ్రామ పసుపు రైతులు 10 వేల 116 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలోనే దివ్యాంగురాలై రజిత అనే యువతి రూ. 5వేలు ను ఎంపి కవితకు విరాళంగా అందించారు. రజిత తన పట్ల చూపిన ప్రేమాభిమానాలకు కవిత ఉద్వేగానికి లోనయ్యారు. చెమర్చిన కళ్ళను తుడుచుకుని ఎంపి కవిత ఆ యువతిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
undefined
మంగళవారం సాయంత్రం నిజామాబాద్ లోని గిరి రాజ్ కాలేజీ మైదానంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు విజీ గౌడ్, ఆకుల లలిత, నిజామాబాద్ అర్భన్, రూరల్ ఎమ్మెల్యేలు బి గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి, ఇతర స్థానిక నేతలతో కలిసి కవిత పరిశీలించారు.
undefined
ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని... ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన దక్షత, దార్శనికత ఇప్పుడు దేశానికి మార్గదర్శకం కాబోతోందని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. రైతుబంధు రైతు బీమా కెసిఆర్ కిట్ లో వంటి అనేక పథకాలను దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అమలుకు పూనుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ తార్కాణమని చెప్పారు. దీని ద్వారా దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని వారు చెప్పకనే చెప్పినట్టు అయిందని ఎంపీ కవిత స్పష్టం చేశారు.
undefined
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేర్చిన పార్టీ దేశంలో టిఆర్ఎస్ ఒకటేనని కవిత తెలిపారు. ఇచ్చిన హామీలను 5 ఏళ్లు గడిచిన తర్వాత కూడా గుర్తు పెట్టుకొనని నాయకులను మనం ఎందరినో చూశామని, దానికి భిన్నంగా చెప్పినవే కాకుండా చెప్పని వాటిని కూడా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల పట్ల తెలంగాణ పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.
undefined
ఇందిరాగాంధీ గరీబీ హఠావో.. నినాదం ను ఇస్తే ఆమె మనవడు రాహుల్ కూడా సాధించలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని నింపాల్సిన అవసరాన్ని కెసిఆర్ చెప్తున్న వైనం ఇప్పుడు దేశ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ బిజెపిలు ఇన్నేళ్లు పరిపాలించిన ఈ దేశంలో ఇంకా జరగాల్సినంత అభివృద్ధి ఇ జరగలేదని విదేశాలకు వెళ్లి వచ్చిన విద్యార్థులు ఉద్యోగులు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని కవిత వివరించారు.
undefined
ఈ పరిస్థితుల ను అధిగమించడానికి దేశానికి కొత్త నాయకత్వం రాజకీయం అవసరమని భావించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన ని దీవించాలని ప్రజలను కోరారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన కెసిఆర్ పట్టుదల ఇప్పుడు 16 ఎంపీ సీట్లను సాధించుకుంటే.. ఆయన వెనుక ఉన్న మరో వందకు పైగా ఎంపీలతో కలిసి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చవచ్చునని కవిత వివరించారు.
undefined
ఎంపీటీసీ నుంచి ఎంపీ ల వరకు టిఆర్ఎస్ నాయకులే ఉండడం వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వంలో ఒక పార్టీ, ఎమ్మెల్యేలు. ఇతర పదవుల్లో మరొక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే టిఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించుకున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.
undefined
జగిత్యాల లో జరిగిన ప్రెస్ మీట్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టిఆర్ఎస్ నాయకులు బోగారపు వెంకటేశ్వర్లు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ , విజయా రెడ్డి పాల్గొన్నారు. కోరుట్ల లో జరిగిన ప్రెస్ మీట్ లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
undefined
click me!