YouTube: పర్మిషన్ లేకుండా మీ వీడియోను ఎవ‌రైనా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారా.? ఏం చేయాలంటే..

Published : Oct 01, 2025, 11:15 AM IST

YouTube: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ యూట్యూబ్ ఛాన‌ల్ ఓపెన్ చేసే రోజులు వ‌చ్చేశాయ్‌. దీంతో కంటెంట్‌ను కాపీ కూడా ఎక్కువుతోంది. మీరు క‌ష్ట‌ప‌డి చేసిన వీడియోను ఎవ‌రైనా ఎత్తేసి వారి ఛాన‌ల్‌లో అప్లోడ్ చేసుకున్నారా.?  

PREV
15
హ‌క్కుల ఉల్లంఘన మాత్ర‌మే కాదు

యూట్యూబ్‌లో మీరు అప్‌లోడ్ చేసిన‌ వీడియోను మరొకరు మీ అనుమతి లేకుండా అప్‌లోడ్ చేయడం కేవలం మీ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, అది నేరుగా కాపీరైట్ ఉల్లంఘన కిందకి వస్తుంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ రక్షణ కోసం యూట్య‌బ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియను తెలుసుకుందాం.

25
కాపీరైట్ అంటే ఏమిటి?

కాపీరైట్ అనేది వీడియోలు, సంగీతం, ఫోటోలు, కథలు వంటి సృజనాత్మక కంటెంట్‌పై అసలు సృష్టికర్తకు లభించే చట్టపరమైన హక్కు. అనుమతి లేకుండా ఆ కంటెంట్‌ను వాడటం కాపీరైట్ ఉల్లంఘన అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో క్రియేట‌ర్‌కు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.

35
వీడియో తొలగింపుని ఎలా అభ్యర్థించాలి?

మీ అనుమతి లేకుండా మీ వీడియోను ఎవరైనా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే మీరు దాన్ని తొలగించాలని అధికారికంగా అడగవచ్చు. ఇందుకోసం రెండు మార్గాలున్నాయి. వీటిలో మొద‌టిది ఆన్‌లైన్ వెబ్ ఫామ్ ద్వారా అభ్యర్థన పంపడం మ‌రొక‌టి ఇమెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపడం.

45
వెబ్ ఫామ్ ద్వారా వీడియో తొలగించే విధానం:

* ఇందుకోసం ముందుగా యూట్యూబ్ స్టూడియోలోకి లాగిన్ అవ్వాలి.

* ఆ త‌ర్వాత ఎడమ వైపు ఉన్న “Copyright” విభాగంపై క్లిక్ చేయండి.

* అక్కడ “New Removal Request” పై క్లిక్ చేయండి.

* ఇప్పుడు ఒక వెబ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో కాపీ చేసిన వీడియో లింక్, మీ అసలు వీడియో వివరాలు,

మీ పేరు, చిరునామా, ఇమెయిల్ వంటి వివరాలు ఎంట‌ర్ చేయాలి.

* చట్టపరమైన ప్రకటనలతో అంగీకరించి, “ఈ వీడియోల కాపీలు మళ్లీ యూట్యూబ్‌లో కనిపించకుండా నిరోధించు” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

* చివరగా Submit బటన్‌పై క్లిక్ చేయండి.

55
ఇమెయిల్ ద్వారా వీడియో తొలగించే విధానం:

copyright@youtube.com అనే మెయిల్ ఐడీ ద్వారా కూడా కాపిరైట్‌ను రైజ్ చేయొచ్చు. ఇందుకోసం మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్‌తో పాటు మీరు క్రియేట్ చేసిన కంటెంట్‌, ఉల్లంఘన చేసిన వీడియో లింక్, మీ అసలు వీడియో ఎక్కడ అప్‌లోడ్ అయ్యిందో దాని వివరాలు, చట్టపరమైన ప్రకటన, చివరగా మీ లీగల్ పేరు రాసి మెయిల్ చేయాలి. యూట్యూబ్ మీ అభ్యర్థనను స్వీకరించిన తర్వాత, ఆ వీడియోను తొలగించడమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ ఎవరూ అదే వీడియోను అప్‌లోడ్ చేయకుండా నిరోధించే అవకాశాన్ని కూడా ఇస్తుంది.

కంటెంట్‌ను ఎలా ర‌క్షించుకోవాలి?

ఎల్లప్పుడూ మీ వీడియోలపై మీ హక్కులను క్లెయిమ్ చేయండి. అవసరమైతే కాపీరైట్ ట్రాకింగ్ టూల్స్ వాడండి. అనుమతి లేకుండా మీ వీడియో ఎక్కడైనా కనపడితే వెంటనే చర్య తీసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories