Whatsapp Tricks: మీ గ‌ర్ల్ ఫ్రెండ్ స్టేట‌స్ చూడాలి.. కానీ చూసిన‌ట్లు త‌న‌కు తెలియ‌కూడ‌దు. ఇందుకోసం ఏం చేయాలంటే..

Published : Sep 19, 2025, 09:40 AM IST

Whatsapp Tricks: వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండ‌ద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే వాట్సాప్‌లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక స్పెష‌ల్ ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
స్టేట‌స్ చూసిన‌ట్లు తెలియ‌కూడ‌దంటే..

వాట్సాప్‌లో ఎక్కువ మంది ఉప‌యోగించే వాటిలో స్టేట‌స్ ఫీచ‌ర్ ఒక‌టి. మ‌నం ఎవ‌రి స్టేట‌స్ చూసినా అవ‌త‌లి వ్య‌క్తికి చూసిన‌ట్లు తెలిసిపోతుంది. అయితే మ‌నం ఎదుటి వారి స్టేట‌స్‌ను చూసినా, వారికి తెలియ‌కుండా కూడా చూడొచ్చు. చాలామందికి ఈ ట్రిక్‌ గురించి తెలియదు. మ‌రి ఎదుటి వారికి తెలియ‌కుండా స్టేట‌స్‌ను ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

25
Read Receipts ఆప్షన్ ఆఫ్ చేయడం

WhatsApp లో Read Receipts అనే ఒక ప్రత్యేక సెట్టింగ్ ఉంటుంది. దీన్ని ఆఫ్ చేస్తే, మీరు ఎవరి స్టేటస్ చూసినా వారు మీ పేరు లిస్టులో చూడలేరు. అంటే, వారు మీరది చూశారనే విషయం వారికి తెలియదు.

సెట్టింగ్ ఎలా మార్చాలి?

* WhatsApp ఓపెన్ చేయండి

* Settings → Privacy లోకి వెళ్లండి

* అక్కడ Read Receipts ఆప్షన్‌ను ఆఫ్ చేయండి

* దీంతో మీరు మెసేజ్‌లు కూడా ఎవరికీ తెలియకుండా చదవగలుగుతారు.

File Manager ద్వారా స్టేటస్ చూడటం (Android మాత్రమే)

ఆండ్రాయిడ్ ఫోన్‌లో File Manager ఉపయోగించి కూడా స్టేటస్‌ను ఎవరికీ తెలియకుండా చూడవచ్చు.

35
ఏం చేయాలంటే.?

* ఫోన్‌లో File Manager ఓపెన్ చేయండి

* Internal Storage → WhatsApp → Media → Statuses లోకి వెళ్లండి

* ఇక్కడ అన్ని స్టేటస్‌లు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. మీరు వాటిని నేరుగా చూడవచ్చు

ఫోల్డర్ కనిపించకపోతే, File Manager లో “Show Hidden Files” ఆప్షన్ ఎనేబుల్ చేయాలి.

45
WhatsApp Web + Incognito Mode

ల్యాప్‌టాప్ లేదా PCలో WhatsApp Web ఉపయోగించేవారికి ఇది మంచి ట్రిక్.

ఇందు కోసం ఏం చేయాలంటే.?

* Chrome బ్రౌజర్‌లో Incognito Mode ఓపెన్ చేయండి

* web.whatsapp.comకి వెళ్లి, మీ ఫోన్‌తో QR కోడ్ స్కాన్ చేయండి

* Status Tab ఓపెన్ చేసి, స్టేటస్ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచి ఉండండి

* ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ (Wi-Fi/డేటా) ఆఫ్ చేయండి

* ఆఫ్‌లైన్ లోనే స్టేటస్ చూడండి. సెషన్‌ను క్లోజ్ చేస్తే హిస్టరీ సేవ్ కాకపోవడం వల్ల మీ పేరు కనిపించదు

55
థార్డ్ పార్టీ యాప్స్

ఇంటర్నెట్‌లో కొన్ని Third-Party Apps ద్వారా WhatsApp స్టేటస్ చూడొచ్చని చెబుతుంటారు. కానీ ఇవి సురక్షితం కావు. మీ ప్రైవసీ, డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే అధికారిక WhatsApp ఫీచర్స్ లేదా పై చెప్పిన సింపుల్ ట్రిక్స్ మాత్రమే వాడటం మంచిది.

జాగ్రత్తగా ఉపయోగించాలి

ఈ ఫీచర్స్‌తో మీరు ఎవరికీ తెలియకుండా స్టేటస్ చూడొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే — WhatsApp ప్రైవసీ సెట్టింగ్స్ తరచూ అప్‌డేట్ అవుతుంటాయి. కాబట్టి మీ ఫోన్‌లోని WhatsApp వెర్షన్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories