Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే ఎర్లీ సేల్‌లో భాగంగా పలు డీల్స్‌ను అందిస్తోంది. ల్యాప్‌టాప్‌పై లభిస్తున్న ఒక బెస్ట్ డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అసుస్ వివో బుక్ గో 14పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 43,990కాగా 32 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 29,990కే సొంతం చేసుకోవచ్చు. అయితే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా రూ. 43,990 ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 26 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. అయితే ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 6900 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
25
డిజైన్, డిస్‌ప్లే
* ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల Full HD (1920 x 1080) డిస్ప్లేతో వస్తుంది.
* 16:9 అస్పెక్ట్ రేషియో ఈ స్క్రీన్ సొంతం.
* 60హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్‌తో తీసుకొచ్చారు.
* 250 నిట్స్ బ్రైట్‌నెస్
* యాంటీ-గ్లేర్ టెక్నాలజీని ఇచ్చారు. దీంతో ఎక్కువ సేపు చదవడం, పని చేయడం కళ్లకు ఇబ్బంది కలిగించదు. మిక్స్‌డ్ బ్లాక్ కలర్లో లభ్యమయ్యే ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.38 kg బరువుతో చాలా తేలికగా ఉండి, ట్రావెల్ లేదా డైలీ యూజ్‌కి సరిపోతుంది.
35
ప్రాసెసర్, గ్రాఫిక్స్ పనితీరు
* ASUS Vivobook Go 14లో AMD Ryzen 3 7320U ప్రాసెసర్‌ను అందించారు.
* బేస్ స్పీడ్: 2.4GHzగా ఉంది.
* Max Boost: 4.1GHz
* 6MB క్యాచీ మెమోరీని అందించారు. ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ AMD Radeon GPU ఉంది. ఇది సాధారణ గేమింగ్, మల్టీమీడియా ఎడిటింగ్, వీడియో స్ట్రీమింగ్‌కి బాగా సరిపోతుంది.
ఈ కాంబినేషన్ ల్యాప్‌టాప్‌ని సూపర్ ఫాస్ట్‌గా మారుస్తుంది. బూట్ టైమ్ తక్కువగా ఉంటుంది, పెద్ద ఫైళ్లను కూడా సెకన్లలో ఓపెన్ చేయవచ్చు. విద్యార్థులు, వర్క్ ఫ్రం హోమ్ యూజర్లు లేదా ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ చాయిస్.
55
సాఫ్ట్‌వేర్, అదనపు ఫీచర్లు
* ఈ ల్యాప్‌టాప్‌లో Windows 11 Home ప్రీ-ఇన్‌స్టాల్‌డ్‌గా వస్తుంది.
* Microsoft 365 Basic (1 సంవత్సరం ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, 100GB క్లౌడ్ స్టోరేజ్‌తో)
* Office Home 2024 లైఫ్‌టైమ్ వాలిడిటీతో లభిస్తుంది. కీబోర్డ్ చిక్లెట్ స్టైల్లో ఉండి టైపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, 42WHrs బ్యాటరీ ఉండటం వలన ఒకసారి ఛార్జ్ చేస్తే గంటల తరబడి పని చేయవచ్చు.