WhatsApp Tips : మీ ఫోన్ స్విచ్చాఫ్ అయినా వాట్సాప్ మెసెజ్ లు పంపొచ్చు.. ఎలాగో తెలుసా?

Published : Nov 26, 2026, 03:53 PM IST

ఫ్రెండ్స్‌కి బర్త్‌డే విషెస్ చెప్పడానికి ఇక రాత్రి 12 గంటల దాకా మేల్కొనాల్సిన పనిలేదు. మీరు ముందే టైప్ చేసి పెట్టుకున్న మెసేజ్ కరెక్ట్ టైమ్‌కి దానంతటదే వెళ్లిపోయేలా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

PREV
15
వాట్సాప్ షెడ్యూల్... ఏంటి ఈ కొత్త ఫీచర్?

ఇప్పటివరకు వాట్సాప్‌లో మెసేజ్ పంపాలంటే సెండ్ బటన్ నొక్కడం తప్పనిసరి… ఇకపై బటన్ నొక్కకుండానే పంపవచ్చు. కరెక్ట్ టైమ్‌కి ఆటోమెటిక్‌గా మెసేజ్ సెండ్ చేసే ఆప్షన్ ఇంతకాలం లేదు. అయితే ఈ లోటును తీరుస్తూ వాట్సాప్ 'షెడ్యూల్డ్ మెసేజెస్' (Scheduled Messages) ఫీచర్‌ను తీసుకొచ్చింది.

నవంబర్ 25, 2026న వచ్చిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రకారం… యూజర్లు కనీసం 10 నిమిషాల నుంచి 14 రోజుల ముందు వరకూ వాట్సాప్ మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందులో టెక్స్ట్‌తో పాటు ఫొటోలు, వీడియోలను కూడా నిర్ణీత సమయంలో పంపేలా సెట్ చేయొచ్చు. ఇది పర్సనల్ చాట్స్, గ్రూప్ చాట్స్ రెండింటిలోనూ పనిచేస్తుంది.

25
వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేయడం ఎలా?

ఈ ఫీచర్‌ని వాడటం చాలా ఈజీ. మీ వాట్సాప్ అకౌంట్‌కి ఈ అప్‌డేట్ వస్తే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

1. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి.

2. మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌కి వెళ్లండి.

3. పంపాల్సిన మెసేజ్‌ని టైప్ చేయండి.

4. వెంటనే సెండ్ బటన్ నొక్కకుండా.. దాన్ని కాసేపు లాంగ్ ప్రెస్ చేయండి.

5. అప్పుడు మెసేజ్ పంపాల్సిన డేట్, టైమ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

6. మీకు కావాల్సిన డేట్, టైమ్ సెలెక్ట్ చేసుకోండి.

7. చివరగా కన్ఫర్మ్ బటన్ నొక్కితే మెసేజ్ షెడ్యూల్ అయిపోతుంది. మీరు సెట్ చేసిన టైమ్‌కి వాట్సాప్ ఆటోమెటిక్‌గా ఆ మెసేజ్‌ని సెండ్ చేస్తుంది.

35
ఏయే మెసేజ్‌లను షెడ్యూల్ చేయొచ్చు?

ఈ కొత్త ఫీచర్‌లో మూడు రకాల కంటెంట్‌ను పంపొచ్చు. టెక్స్ట్ మెసేజెస్ (బర్త్‌డే విషెస్, ఎగ్జామ్ విషెస్, ముఖ్యమైన రిమైండర్లు), ఫొటోలు, వీడియోలు కూడా ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఫ్రెండ్ బర్త్‌డేకి రాత్రి 12 గంటలకు విష్ చేయాలనుకుంటే, ముందే మెసేజ్ టైప్ చేసి టైమ్ సెట్ చేసుకోవచ్చు. మీరు హాయిగా నిద్రపోతున్నా కరెక్ట్ టైమ్‌కి మెసేజ్ డెలివరీ అయిపోతుంది.

ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా మెసేజ్ వెళ్తుందా?

ఈ ఫీచర్‌కు ఉన్న మెయిన్ హైలైట్ ఇదే. మెసేజ్ వెళ్లాల్సిన టైమ్‌కి ఫోన్ మీ చేతిలో ఉండాల్సిన పనిలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా, బ్యాటరీ అయిపోయినా సరే.. షెడ్యూల్ చేసిన మెసేజ్ కరెక్ట్ టైమ్‌కి సెండ్ అవుతుంది. అంతేకాదు మిగతా చాట్స్ లాగానే ఈ మెసేజ్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సేఫ్‌గా ఉంటాయి.

45
షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను చూసుకోవచ్చా, డిలీట్ చేయొచ్చా?

ఒకసారి మెసేజ్‌ను ముందే షెడ్యూల్ చేశాక, దాన్ని మార్చలేమా అన్న డౌట్ రావొచ్చు. దీనికి కూడా వాట్సాప్ సొల్యూషన్ ఇచ్చింది. మీరు సెండ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్న షెడ్యూల్డ్ మెసేజెస్ లిస్ట్‌ను చూసుకోవచ్చు. ఒకవేళ మీ ప్లాన్ మారితే, మెసేజ్ డెలివరీ అయ్యేలోపే దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఉదాహరణకు ఓ ఫ్రెండ్‌కి ఉదయం 8 గంటలకు రిమైండర్ పంపాలనుకుని, మళ్లీ వద్దనుకుంటే ఆ టైమ్‌ కంటే ముందే డిలీట్ చేసేయొచ్చు. అయితే షెడ్యూల్ చేసిన మెసేజ్‌ని ఎడిట్ చేయడం గానీ, టైమ్ మార్చడం గానీ చేయొచ్చని వాట్సాప్ ఇప్పటికైతే కన్ఫర్మ్ చేయలేదు.

55
ఈ ఫీచర్ ఎవరెవరికి వస్తుంది?

వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగా రోల్ అవుట్ చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికీ రాబోయే కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కాబట్టి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ ఇంకా కనిపించకపోతే టెన్షన్ పడాల్సిన పనిలేదు. అందరికీ ఒకేసారి రాకపోవచ్చు. యాప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండండి. ఫీచర్ రాగానే సెండ్ బటన్‌ని లాంగ్ ప్రెస్ చేసి వాడొచ్చు.

వాట్సాప్ యూజర్లకు లాభమేంటి? 

ఈ ఫీచర్ కేవలం నార్మల్ యూజర్లకే కాదు, ఆఫీస్ పనులకు వాట్సాప్ వాడేవాళ్లకి కూడా బాగా యూజ్ అవుతుంది. బర్త్‌డే, యానివర్సరీ విషెస్‌ని మర్చిపోకుండా పంపొచ్చు. ఆఫీస్ గ్రూప్స్‌లో ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్‌లను ముందే రెడీ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూల రిమైండర్లు సెట్ చేసుకోవచ్చు. వేరే దేశాల్లో ఉండే ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వాళ్ల టైమ్ జోన్‌కి తగ్గట్టుగా మెసేజ్‌లు పంపొచ్చు. యూజర్లు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ ఫీచర్ వాట్సాప్‌లో పెద్ద చేంజ్ అని చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories