Motorola Edge 70 Neo : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.41 వేల ఈ ఫోన్ రూ.35 వేలకే పొందండి

Published : Nov 25, 2026, 05:27 PM IST

మోటరోలా కంపెనీ 'Motorola Edge 70 Neo' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. రూ.40,999 విలువైన 8GB/128GB మోడల్‌ను లాంచ్ ఆఫర్‌తో కేవలం రూ.34,999కే సొంతం చేసుకోవచ్చు.

PREV
14
ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్

బడ్జెట్‌ ధరలో పెద్ద బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, సూపర్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మోటరోలా తెచ్చిన కొత్త ఫోన్ మీ కోసమే. ఇండియన్ మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 70 నియో (Motorola Edge 70 Neo) ఫోన్‌ లాంచ్ అయ్యింది. స్లిమ్ డిజైన్, స్మూత్ పెర్ఫార్మెన్స్‌తో వస్తున్న ఈ 'ఆల్-రౌండర్' ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు చూద్దాం.

లాంచ్ ఆఫర్‌తో అదిరిపోయే ధర..

ఈ మోటరొలా ఎడ్జ్ 70 నియో ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తోంది. దీని అసలు ధర రూ.40,999. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.3,000 డిస్కౌంట్, మరో రూ.3,000 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే ఈ ఫోన్‌ను మీరు రూ.34,999కే కొనుక్కోవచ్చు.

24
సేల్ ఎప్పుడు? స్పెసిఫికేషన్లు ఏంటి?

డిసెంబర్ 1, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మోటరొలా ఇన్ (Motorola.in), రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) స్టోర్లలో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ పాంటోన్ మౌంటైన్ వ్యూ, మిల్కీ బ్లూ, గ్రే లైలాక్, సేజ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతుంది. సిల్క్, లెదర్, ఎసిటేట్ లాంటి డిఫరెంట్ ఫినిషింగ్స్‌తో ఇవి ప్రీమియం లుక్ ఇస్తాయి.

అద్భుతమైన 144Hz AMOLED డిస్‌ప్లే

మోటరొలా ఎడ్జ్ 70 నియో ఫోన్ లో స్క్రీన్ పెద్ద ప్లస్. ఇందులో 6.8 అంగుళాల Extreme AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. 1.5K రిజల్యూషన్ (2,772 x 1,272 పిక్సెల్స్), 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటంతో వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్, స్క్రాచెస్ పడకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేయగానే ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో ఈ ఫోన్ వస్తుంది. దీనికి 3 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని మోటరోలా చెప్పింది.

పెర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, 8GB LPDDR5X RAM, 128GB UFS 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ సేపు గేమింగ్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 4,466mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు.

34
50MP సోని లైటియా 710 కెమెరా

ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP Sony LYTIA 710 ప్రైమరీ కెమెరా ఇచ్చారు. దీంతో 4K వీడియోలు సూపర్ క్వాలిటీతో రికార్డ్ చేయొచ్చు. దీనికి తోడు 2MP మ్యాక్రో కెమెరా, లైట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32MP కెమెరా ఇచ్చారు (కానీ ఇందులో అల్ట్రావైడ్ సెన్సార్ లేదు).

7,000mAh భారీ బ్యాటరీ, బైపాస్ ఛార్జింగ్

ఈ ఫోన్ స్లిమ్‌గా ఉన్నా ఇందులో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ ఉంది. కంటిన్యూగా వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా బ్యాటరీ సులభంగా ఒక రోజంతా వస్తుంది. ఇది 45W టర్బోపవర్ ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ పెట్టుకుని గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఈ బైపాస్ ఛార్జింగ్ బాగా ఉపయోగపడుతుంది. 204 గ్రాముల బరువు, 8.49mm మందం ఉన్న ఈ ఫోన్ దుమ్ము, నీటి తుంపర్ల నుంచి తట్టుకునేందుకు IP64 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కోసం MIL-STD-810H సర్టిఫికేషన్‌తో వస్తోంది.

44
మోటరోలా ఎడ్జ్ 70 నియో vs ఒప్పో K14 ప్లస్.. ఏది కొనాలి?

పెద్ద బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, OIS కెమెరా మోటారోలా ఎడ్జ్ 70 నియోకి ప్లస్ పాయింట్స్. అయితే ఇదే బడ్జెట్‌లో ఉన్న ఒప్పో కె14 ప్లస్ (OPPO K14 Plus) దీనికి గట్టి పోటీ ఇస్తోంది. మోటరోలాలో 7,000mAh బ్యాటరీ ఉంటే, ఒప్పోలో దాన్ని మించి 8,000mAh బ్యాటరీ ఇచ్చారు. అందులో స్నాప్‌డ్రాగన్‌కు దీటైన MediaTek Dimensity 7360 MAX ప్రాసెసర్ ఉంది.

రెండు ఫోన్లలో 50MP OIS కెమెరా ఉన్నా, మోటరోలాలో పెద్ద 1/1.56 అంగుళాల Sony LYTIA 710 సెన్సార్ ఉండటంతో తక్కువ వెలుతురులోనూ ఫొటోలు బాగా వస్తాయి (ఒప్పోలో 1/2 అంగుళాల సెన్సార్ మాత్రమే ఉంది). ఈ రెండింటిలోనూ అల్ట్రావైడ్ కెమెరా లేదు. ఫోన్ వేడెక్కకుండా చూసుకోవడంలో ఒప్పో కాస్త ముందుంది. మోటరోలాలో 4,466mm² వేపర్ చాంబర్ ఉంటే, ఒప్పోలో 5,000mm² వేపర్ చాంబర్, 19,989mm² గ్రాఫైట్ కూలింగ్ ఇచ్చారు.

ఎవరికి ఏది బెస్ట్?

మీకు మంచి కెమెరా క్వాలిటీ, క్లాసీ ప్రీమియం డిజైన్ కావాలంటే మోటరొలా ఎడ్జ్ 70 నియో పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడూ హెవీ గేమింగ్ ఆడుతూ, భారీ బ్యాటరీ కావాలనుకునే వారు ఒప్పో కే14 ప్లస్ వైపు వెళ్లొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories