WhatsApp Quick Recap: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. అలాంటి వారికి ఇదో ఓ వరం!

Published : Jul 23, 2025, 01:01 PM ISTUpdated : Jul 23, 2025, 01:04 PM IST

WhatsApp Quick Recap feature: వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకరానున్నది. ఈ ఫీచర్ తో మెసేజ్ లు చదవకుండానే ఆ చాట్‌ సారాంశం  తెలుసుకోవచ్చట. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటీ? దాని ప్రత్యేకలేంటీ?  

PREV
15
వాట్సాప్ కొత్త ఫీచర్ – 'క్విక్ రీక్యాప్'

కోట్లాది మంది యూజర్స్ గల వాట్సాప్  కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. చాలామంది వాట్సాప్‌ యాప్ లో భారీ సంఖ్యలో మెసేజ్ లు వస్తుంటాయి. వాటన్నింటిని చదవడం కష్టం. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్‌కు ‘క్విక్‌ రీక్యాప్‌’ పేరుతో కొత్త ఏఐ ఎనేబుల్డ్‌ ఫీచర్‌ను జోడించబోతున్నది. ఫీచర్ సహాయంతో  ప్రతి మెసేజ్‌ను విడిగా చదవాల్సిన అవసరం లేకుండా, ఎంచుకున్న చాట్‌ల సారాంశం తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ మెటా AI ద్వారా పనిచేస్తుంది.   

25
ఆండ్రాయిడ్ వినియోగదారులకు శుభవార్త

WABetaInfo నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.21.12లో బీటా టెస్టర్లకు అందుబాటులో రానున్నది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది. కానీ, త్వరలో మెసేజింగ్ యాప్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. WABetaInfo ఈ ఫీచర్‌ను వివరిస్తూ ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. 

35
క్విక్ రీక్యాప్’ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది?

WABetaInfo షేర్ చేసిన వివరాల ప్రకారం.. వాట్సాప్ యాప్ పైభాగంలోని మూడు చుక్కల మెనూలో ‘Quick Recap’ అనే ఆప్షన్ రాబోతుంది. వినియోగదారులు ఈ ఆప్షన్‌కి వెళ్లి, చదవని అనేక చాట్‌లను ఒకేసారిగా ఎంచుకోవచ్చు. తరువాత, మెటా AI సహాయంతో ఆ మెసేజ్‌లకు సంక్షిప్త సారాంశం చూపించబడుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి అనేక Unread మెసేజ్‌లు తక్కువ సమయంలో అర్థం చేసుకోవచ్చు ఇది ఒక గేమ్‌చేంజర్ ఫీచర్ అనే చెప్పాలి. 

45
త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు!

‘క్విక్ రీక్యాప్’ ఫీచర్‌తో పాటు ఆండ్రాయిడ్, iOS యూజర్లకు ఇంకా అనేక కొత్త ఫీచర్లను అందించబోతుంది. అయితే ఈ వినూత్న ‘Quick Recap’ ఫీచర్ సాధారణ వినియోగదారులకు ఎప్పుడు విడుదల అవుతుందో అన్న విషయంలో ఇప్పటికీ అధికారిక స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఇది బీటా టెస్టింగ్ దశలో ఉంది. 

55
బిజీ యూజర్లకు ఇదొక వరం

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో బీటా ప్రోగ్రామ్‌లో నమోదు అయిన వినియోగదారులు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నారు. బిజీగా ఉండే యూజర్లకు ఇది గొప్ప వరంగా మారుతోంది. ఎందుకంటే unread మెసేజ్‌ల సారాంశాన్ని ఒకే దృష్టిలో చూపించి, సమయం ఆదా చేయడం, ముఖ్యమైన సమాచారం తక్కువ టైమ్‌లో అర్థం చేసుకునేలా చేయడం ఈ ఫీచర్ లక్ష్యం.  

Read more Photos on
click me!

Recommended Stories