Venus aerospace: రెండున్న‌ర గంటల్లో హైద‌రాబాద్ టూ న్యూయార్క్‌.. కొత్త టెక్నాల‌జీ వ‌చ్చేస్తోంది

Published : Jun 02, 2025, 02:59 PM IST

మ‌నిషి రోజురోజుకీ శాస్త్ర‌సాంకేతికంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దూరాన్ని, కాలాన్ని జ‌యించే దిశ‌గా అడుగులు ప‌డుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే శబ్ద వేగాన్ని మించే ప్రయాణానికి వీనస్‌ ఎయిరోస్పేస్ అనే సంస్థ నాంది ప‌లుకుతోంది.

PREV
15
ధ్వ‌ని వేగంతో ప్ర‌యాణం

మ‌నిషి ధ్వ‌ని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించే రోజులు ద‌గ్గ‌ర‌ల్లోనే ఉన్నాయన్న నమ్మకానికి బ‌లాన్ని చేకూర్చింది అమెరికాలోని వీనస్‌ ఎయిరోస్పేస్‌ సంస్థ చేసిన తాజా ప్రయోగం. మే 14న న్యూమెక్సికోలోని స్పేస్‌పోర్ట్‌ అమెరికా నుంచి, రోటేటింగ్‌ డిటొనేషన్‌ రాకెట్‌ ఇంజిన్‌ (RDRE) ద్వారా నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది.

 సంస్థ సీఈఓ సస్సీ డగుల్బీ ఈ ప్రయోగాన్ని ఐదేళ్లుగా చేస్తున్న పరిశోధనలకు ఫలితంగా పేర్కొన్నారు. ఈ ఇంజిన్‌ను వారు అభివృద్ధి చేస్తున్న హైపర్‌సోనిక్‌ జెట్‌ "స్టార్‌గేజర్‌"లో ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

25
హైద‌రాబాద్ టూ న్యూయార్క్ రెండున్న‌ర గంట‌ల్లోనే

స్టార్‌గేజర్‌ జెట్‌ శబ్ద వేగానికి స‌మానంగా అంటే గంటకు 3,069 మైళ్లు ప్రయాణించగలదని వీనస్‌ తెలిపింది. ఇది కమర్షియల్‌ ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పునకు నాంది పలికే అవకాశం ఉంది. 

ఇది నిజంగానే కార్య‌రూపం దాల్చితే హైద‌రాబాద్ నుంచి న్యూయార్క్కు కేవ‌లం రెండున్నర గంట‌ల్లో వెళ్లొచ్చు. ఈ ప్రాజెక్టును 2030లో అమలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ జెట్‌లో ఒక్కసారి 12 మంది ప్ర‌యాణించ‌గ‌ల‌రు.

35
చరిత్రలో మైలురాయి

ఈ ఇంజిన్‌ సాధారణంగా ప్రయోగశాలలో పరీక్షలు జ‌రుపుకుంటోంది. కానీ వాస్తవ వాతావరణంలో ప్రయోగించడంలో ఇదే తొలి మైలురాయిగా చెప్పొచ్చు. తక్కువ పరిమాణం, మెరుగైన సమర్థతతో ఈ టెక్నాలజీ అడ్వాన్స్‌డ్‌ ఏరోస్పేస్‌ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది.

రాకెట్‌ ఇంధనాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించే విధంగా ఈ ఇంజిన్‌ పని చేస్తుంది. దీన్ని అభివృద్ధి చేయాలని 1980ల నుంచే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు గగనతల ప్రయోగంతో ఆ దిశగా మంచి పురోగతి సాధించినట్లయింది.

45
మాక్‌ 6 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం

వీనస్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన వీడీఆర్‌2 (VDR-2) అనే డిటొనేషన్‌ జెట్‌తో ఈ ఇంజిన్‌ను కలిపి పని చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మాక్‌ 6 (శబ్ద వేగానికి 6 రెట్లు) కంటే వేగంగా ప్రయాణించగలదు. 

ఇది సాధారణ రాకెట్ల మాదిరిగా ఆక్సిజన్‌ను ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, వాతావరణ గాలిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సూపర్‌సోనిక్‌ షాక్‌ వేవ్స్‌ను ఉపయోగించి ఎక్కువ వేగాన్ని అందిస్తుంది.

55
కంకోర్డ్‌ తర్వాత మళ్లీ అలాంటి వేగం

స్టార్‌గేజర్‌ విజయవంతమైతే, ఇది 20 సంవత్సరాల క్రితం సేవలు ఆపిన "కంకోర్డ్‌" తర్వాత మళ్లీ శబ్ద వేగాన్ని మించిన ప్రయాణాలకు మార్గం చూపుతుంది. 

కంకోర్డ్‌ అప్పట్లో 60,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేది. అయితే స్టార్‌గేజర్‌ 1,10,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు.

Read more Photos on
click me!

Recommended Stories