Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి

Published : Sep 11, 2026, 04:38 PM IST

ఇంటర్నెట్‌లో కోట్లాది వెబ్‌సైట్లు ఉన్నాయి… కానీ వాటిలో కొన్ని మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. ఇలా మిమ్మల్ని చూస్తుండగానే మరో లోకంలోకి తీసుకెళ్ళే వెబ్ సైట్స్ గురించి తెలుసుకుందాం.

PREV
15
ఇంటర్నెట్ లో స్పెషల్ వెబ్‌సైట్

ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (చాట్‌జీపీటీ) సాయంతో 1980 నాటి వింటేజ్ స్టైల్ ఫోటోలను క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పెడుతున్నారు. ఇలా 80s ఫోటోలను నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తున్నారు.

అయితే ఏఐ సాయంతోనే కాదు కొన్ని వెబ్ సైట్స్ తో కూడా ఇలాంటి అద్భుతాలు అనేకం చేయవచ్చు. ఓ వెబ్ సైట్ లో ఫొటో అప్‌లోడ్ చేస్తే దానికి ప్రాణం వచ్చినట్టు కనిపిస్తుంది… ఇంకో వెబ్‌సైట్‌లో కూర్చున్న చోటి నుంచే సముద్ర గర్భంలోకి వెళ్లొచ్చు… మరొకదాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎగిరే విమానాలను లైవ్‌లో చూడొచ్చు. ఇలాంటి స్పెషల్ వెబ్ సైట్స్ ఏవో తెలుసా?

25
1. MyHeritage Deep Nostalgia

పాత ఫొటోలు చూస్తే మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. కానీ ఆ ఫొటోలోని వ్యక్తి కళ్లు ఆర్పితే, నవ్వితే ఎలా ఉంటుంది? 'MyHeritage Deep Nostalgia' అనే AI టెక్నాలజీ దీన్నే సాధ్యం చేస్తుంది. ఇందులో పాత ఫొటో అప్‌లోడ్ చేస్తే AI దానికి కదలికలు ఇస్తుంది. ఫొటోలోని వ్యక్తి కళ్లు ఆర్పడం, నవ్వడం, తల తిప్పడం వంటివి చేస్తారు... దీంతో పాత ఫొటోలు కూడా వీడియోలా కనిపిస్తాయి. ఇది పాత కుటుంబ ఫొటోలను కొత్తగా చూసే అనుభూతినిస్తుంది… అలాగే చనిపోయినవారిని మన ముందే సజీవంగా ఉన్నట్లుగా చూపిస్తుంది.

35
2. Neal.fun – The Deep Sea

విశాలమైన సముద్రంగర్భంలో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. మీకు కూడా ఉందా? అయితే మీరు సముద్రం వద్దకు వెళ్లాల్సిన పనిలేదు… సముద్రమే మీ దగ్గరకు వస్తుంది… 'Neal.fun – The Deep Sea' వెబ్‌సైట్ ఈ పని చేస్తుంది.

ఈ వెబ్ సైట్‌ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తూ వెళుతుంటే మీరు సముద్రంలోకి వెళుతున్న ఫీలింగ్ ఉంటుంది… పైనుంచి లోపలికి వెళ్ళేకొద్దీ వెలుతురు తగ్గిపోతుంది… వివిధ లోతుల్లో కనిపించే వింత జీవుల గురించి కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇంట్లో కూర్చునే సముద్ర గర్భంలోని ప్రపంచాన్ని వర్చువల్‌గా చూడొచ్చన్నమాట.

45
3. Flightradar24

ఆకాశంలో విమానం వెళ్తుంటే అది ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది? అని తెలుసుకోొవాలని ఉందా? అయితే 'Flightradar24' వెబ్ సైట్ మీ క్యూరియాసిటీకి సమాధానం ఇస్తుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎగిరే విమానాలను లైవ్ మ్యాప్‌లో చూడొచ్చు. మీ ఏరియాలో ఎగిరే విమానం ఏది, ఎక్కడికైనా బయల్దేరిందా లేక ఎక్కడినుండయినా వస్తోందా? అనే వివరాలు తెలుసుకోవచ్చు. విమానాల ప్రయాణాన్ని ఆసక్తిగా గమనించే వారికి ఇది మంచి అనుభూతినిస్తుంది.

55
ఏఐతోనే కాదు ఈ వెబ్ సైట్స్ తో అద్బుతాలు చేయవచ్చు

మనం సాధారణంగా ఇంటర్నెట్ అంటే సోషల్ మీడియా, వీడియోలు, వార్తలు లేదా షాపింగ్ సైట్లు అనే అనుకుంటాం. కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, భిన్నమైన అనుభూతిని పొందడానికి ఇలాంటి వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. పాత ఫొటోలకు AIతో ప్రాణం పోయడం నుంచి సముద్రం లోతులను చూడటం, విమానాలను లైవ్ ట్రాక్ చేయడం వరకు.. ఈ మూడు వెబ్‌సైట్లు ఇంటర్నెట్ ఎంత వైవిధ్యంగా ఉంటుందో చెప్పడానికి మంచి ఉదాహరణలు.

Read more Photos on
click me!

Recommended Stories