Aadhaar: యాప్స్ మారే పనిలేకుండా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ యాప్‌లలోనే ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేసే కొత్త ఫీచర్లని యూఐడీఏఐ లాంచ్ చేసింది. ఆ వివరాలు మీకోసం.
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా కేవైసీ తప్పనిసరి. అయితే, ఇప్పటి వరకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ కోసం ఒక యాప్ నుంచి మరో యాప్‌కి మారాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ తిప్పలు ఉండవు. ఆధార్ జారీ చేసే సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ ప్రక్రియను మరింత ఈజీ చేస్తూ కొత్త ఫేస్ ఆథెంటికేషన్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో యూఏడీఏఐ రెండు కీలకమైన టూల్స్‌ను ఆవిష్కరించింది. అందులో ఒకటి 'ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ SDK' కాగా, రెండోది 'ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ శాండ్‌బాక్స్'. ఈ కొత్త టూల్స్ ద్వారా బ్యాంకులు, ఇన్సూరెన్స్, బ్రోకింగ్, ఫిన్‌టెక్ సంస్థలు తమ సొంత మొబైల్ యాప్‌లలోనే ఫేస్ వెరిఫికేషన్ నేరుగా చేసుకోవచ్చు.
24
పాత పద్ధతికి బై బై.. యాప్‌లు మారే పనిలేదు
ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న విధానంలో ఫేస్ వెరిఫికేషన్ కోసం వినియోగదారులు FaceRD అనే ప్రత్యేకమైన యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ప్రతిసారి ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కి స్విచ్ అవ్వాల్సి వచ్చేది. ఇది వినియోగదారులకు కాస్త విసుగు తెప్పించే విషయం.
అయితే, కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్, iOS సపోర్టు ఇచ్చే SDK సిస్టమ్ ద్వారా యూజర్లు తాము ఉపయోగిస్తున్న బ్యాంకింగ్ లేదా ఇన్సూరెన్స్ యాప్‌లోనే ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల సింగిల్ యాప్ అనుభూతి లభిస్తుంది. డిజిటల్ కేవైసీతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా వేగంగా పూర్తవుతుంది.
34
టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా శాండ్‌బాక్స్
సరికొత్త సేవలను మార్కెట్లోకి తీసుకొచ్చే ముందే వాటిని పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు యూఐడీఏఐ ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ శాండ్‌బాక్స్'ను కూడా ప్రారంభించింది. ఇది సురక్షితమైన ప్రయోగశాల లాంటిది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ కస్టమర్లకు సేవలు అందించడానికి ముందే ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆయా ఫీచర్లను టెస్ట్ చేసుకోవచ్చు.
ఈ శాండ్‌బాక్స్ ద్వారా ఫేస్ క్యాప్చర్, యూజర్ సమ్మతి, వెరిఫికేషన్, ఎర్రర్ హ్యాండ్లింగ్ వంటి అంశాలను పరిశీలించవచ్చు. విశేషమేమిటంటే, దీని కోసం ఎలాంటి ఓపెన్ బయోమెట్రిక్ హార్డ్‌వేర్ అవసరం లేదు. నెట్‌వర్క్ సమస్యలు, టైమ్‌అవుట్, డిజిటల్ సిగ్నేచర్ ఫెయిల్యూర్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ముందే చెక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త SDK టూల్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్‌నెస్, యాంటీ-స్పూఫింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి నకిలీ ఫోటోలు లేదా వీడియోల ద్వారా జరిగే మోసాలను అడ్డుకుంటాయి.
డేటా సురక్షితంగా రవాణా అయ్యేందుకు ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ కూడా ఉంది. అన్ని రకాల కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది సజావుగా పనిచేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ శాఖలు, బ్యాంకింగ్ రంగం, ఇతర సంస్థలు తమ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందించే వీలు కలుగుతుంది.