TCS AI hackathon : భారతీయ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచంలోనే అతిపెద్ద AI హ్యాకథాన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఇందులో ఎన్ని దేశాల నుండి ఎంతమంది ఉద్యోగాలు పాల్గొన్నారంటే..
TCS AI hackathon : భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రపంచంలోనే అతిపెద్ద AI హ్యాకథాన్ నిర్వహించింది. AI హ్యాకథాన్ 2025 మొదటి గ్లోబల్ ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ హ్యాకథాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల నుంచి 2,81,000 మందికి పైగా టీసిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
21 విభిన్న పరిశ్రమలకు సంబంధించిన AI థీమ్‌లపై ఆధారపడిన ఈ ఈవెంట్ చాలా వైవిధ్యంగా, ఉద్యోగులందరి భాగస్వామ్యంలో సాగింది. ఇలా లక్షలమంది ఉద్యోగులు పాల్గొనడంతో ఈ హ్యాకథాన్ కొత్త రికార్డు సృష్టించింది. ఇందులో 33% మహిళలు, 53% విదేశీ కార్యాలయాల ఉద్యోగులు, 36% మధ్యస్థ, సీనియర్ స్థాయి ఉద్యోగులు, 38% GenZ వయసు ఉద్యోగులు, 29% నాన్-టెక్నికల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
25
టీసిఎస్ AI హ్యాకథాన్ ఎందుకు నిర్వహించింది?
AI హ్యాకథాన్ నిర్వహించడం వెనుక టీసిఎస్ ముఖ్య ఉద్దేశం ఉద్యోగులకు జెనరేటివ్ AI (GenAI) ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన కల్పించడమే. ఇలా తమ ఉద్యోగులు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంతో పాటు రోజువారీ పనుల్లో AIని ఉపయోగించే అవకాశం ఈ హ్యాకథాన్ ద్వారా కలిగిందంటోంది టీసిఎస్. ఈ హ్యాకథాన్ ద్వారా ఆవిష్కరణలు, నైపుణ్యాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
35
AI హ్యాకథాన్ ప్రత్యేకతలు
AI హ్యాకథాన్ ప్రజలు, ప్లాట్‌ఫామ్‌లు, భాగస్వాములను కనెక్ట్ చేసి ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఇందులో టాప్ ఏఐ టెక్నాలజీలు, టీసిఎస్ AI విజ్డమ్‌నెక్స్ట్ లాంటి టూల్స్ ఉపయోగించారు. పాల్గొన్నవారికి ఆన్‌లైన్ AI ల్యాబ్స్, ఆఫ్‌లైన్ AI ఫ్రైడే ల్యాబ్స్ యాక్సెస్ లభించింది. దీనివల్ల వారు తమ AI నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలిగారు. హ్యాకథాన్ సబ్మిషన్ల మూల్యాంకనంలో కూడా జెనరేటివ్ AIని ఉపయోగించారు. దీంతో మనుషులు, AI కలిసి పెద్ద ఎత్తున పనులు చేయగలిగారు.
టీసిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్ ప్రకారం... 2,81,000 మందికి పైగా పాల్గొనడం అంటే ఉద్యోగులందరినీ ఏఐ ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది. ఈ హ్యాకథాన్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, భవిష్యత్తు పని సంస్కృతిని కలిసి రూపొందించే ఒక మార్గం. ఇది ఉద్యోగులకు AI నేర్చుకోవడానికి, కొత్త టూల్స్ ప్రయత్నించడానికి, క్లయింట్లు, కమ్యూనిటీ కోసం ప్రభావవంతమైన పరిష్కారాలు అందించడానికి అవకాశం ఇస్తుంది.
55
హ్యాకథాన్‌పై టీసిఎస్ భవిష్యత్ ప్రణాళికలు
ఈ హ్యాకథాన్ ఇప్పుడు భారతదేశంలోని టీసిఎస్ ప్రధాన క్యాంపస్‌లలో వారానికోసారి 'AI ఫ్రైడేస్' రూపంలో కొనసాగుతుంది. చాలా మంది టీసిఎస్ కస్టమర్లు ఈ ఆవిష్కరణలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే అనేక పరిష్కారాలను టీసిఎస్ ఉత్పత్తులు, క్లయింట్ సేవల్లో ఉపయోగించడంపై ఆలోచిస్తున్నారు. ఏఐ వాడకాన్ని ప్రోత్సహించడంలో, ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంలో, కొత్త పరిష్కారాలను అమలు చేయడంలో టీసిఎస్ ఈ చొరవ ఒక మైలురాయిగా నిలుస్తోంది.