మొబైల్ స్టోరేజ్ నిండిపోడానికి చాలా కారణాలున్నాయి... ఫొటోలు, వీడియోలు మాత్రమే కారణం కాదు. నెలకు ఒకసారి కొన్ని క్లీనింగ్ చిట్కాలు పాటిస్తే మీ ఫోన్ వేగంగా, స్మూత్‌గా ఉంటుంది.
మొబైల్ స్టోరేజ్ ఫుల్ (Mobile Storage Full)... ఈ మెసేజ్ వచ్చిందంటే చాలు ఎవరైనా టెన్షన్ పడాల్సిందే. వెంటనే ఫోటోలు, వీడియోలు డిలేట్ చేయడం ప్రారంభిస్తారు. అయితే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవడానికి ఇవిమాత్రమే కాదు అనేక విషయాలు కారణం. అయితే కొన్ని సింపుల్ స్టెప్స్‌తో మీ ఫోన్ లో 5GB నుంచి 20GB వరకు స్టోరేజీని పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
25
కాష్ డేటాను క్లియర్ చేయండి
ఫోన్‌లో ఎక్కువ స్పేస్ ను 'కాష్ డేటా (Cache Data)' తీసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా, ఇతర యాప్స్ వేగంగా పనిచేయడానికి ఈ కాష్ స్పేస్ ను వాడతాయి. కాబట్టి మీ ఫోన్ లో స్టోరేజీ పెంచుకునేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'క్లియర్ కాష్' చేస్తే 1GB నుంచి 3GB వరకు ఖాళీ అవుతుంది.
35
వాట్సాప్ సెట్టింగ్స్...
స్టోరేజ్ సమస్యకు వాట్సాప్ పెద్ద కారణం. వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'స్టోరేజ్ అండ్ డేటా'కు వెళ్లి 'మేనేజ్ స్టోరేజ్'లో అనవసర ఫైల్స్ డిలీట్ చేయండి. 'ఆటో-డౌన్‌లోడ్' ఆపితే 5GB వరకు స్పేస్ దొరుకుతుంది.
చాలామంది 'డౌన్‌లోడ్స్' ఫోల్డర్, 'ట్రాష్/బిన్' గురించి మర్చిపోతారు. ఫైల్ మేనేజర్‌లో పెద్ద ఫైల్స్‌ను డిలీట్ చేయండి. గ్యాలరీలో డిలీట్ చేసినవి ట్రాష్‌లో ఉంటాయి. దాన్ని కూడా ఖాళీ చేయడం ముఖ్యం.
55
డూప్లికేట్ ఫైల్స్ గుర్తించండి..
“Files by Google” యాప్ ఈ పనులను సులభం చేస్తుంది. ఇది డూప్లికేట్, పెద్ద ఫైల్స్‌ను చూపిస్తుంది. గూగుల్ ఫోటోస్ బ్యాకప్ ఉంటే ఫోన్‌లోని ఫొటోలు డిలీట్ చేసి స్పేస్ పొందొచ్చు. ఇది ఫోన్‌ను వేగంగా ఉంచుతుంది.