Smartphone: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌.. రూ. 15 వేలకే స్ట‌న్నింగ్ స్మార్ట్ ఫోన్

Published : Jan 22, 2026, 07:36 AM IST

Smartphone: ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రిప‌బ్లిక్ డే సేల్ 2026 పేరుతో సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ప‌లు ప్రొడ‌క్ట్స్‌పై భారీగా ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. మ‌రి ఈ సేల్‌లో ల‌భిస్తోన్న ఒక బెస్ట్ డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
రూ. 15 వేల‌లో సూప‌ర్ ఫీచ‌ర్లు

ఫ్లిప్‌కార్ట్ రిప‌బ్లిక్ డే సేల్ 2026లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో Moto G86 Power 5G మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒకేసారి పెద్ద బ్యాటరీ, బలమైన బిల్డ్, హై ఎండ్ కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ రూ.15 వేల ధర రేంజ్‌లో దొరుకుతోంది.

25
డిస్కౌంట్ తర్వాత ఎంత ధరకు వస్తుంది?

Moto G86 Power 5G ఫోన్ విడుదల సమయంలో ధర రూ.17,999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,999కి లభిస్తోంది. అదనంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ తగ్గింపుతో సుమారు రూ.1,700 త‌గ్గింపు ధ‌ర పొందొచ్చు. ఫలితంగా ఈ ఫోన్ దాదాపు రూ.15 వేలలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డెన్ సైప్రెస్, కాస్మిక్ స్కై, స్పెల్ బౌండ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

35
సూపర్ AMOLED డిస్‌ప్లే హైలైట్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ HD AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. గరిష్ఠంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ లభిస్తుంది. HDR10+ సపోర్ట్, Low Blue Light SGS సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి.

45
మిలిటరీ గ్రేడ్ బిల్డ్, పవర్‌ఫుల్ ప్రాసెసర్

Moto G86 Power 5G ఫోన్ MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది. IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్‌గా తయారు చేశారు. పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్ వాడారు. ఈ ఫోన్ Android 15 ఆధారంగా Hello UIపై రన్ అవుతుంది.

55
కెమెరా, బ్యాటరీ ఫీచర్లు

ఫోటోగ్రఫీ పరంగా వెనుక భాగంలో 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా ఉంది. అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరా, 3-in-1 ఫ్లిక్కర్ లెన్స్ ఇచ్చారు. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. బ్యాటరీ విషయంలో ఈ ఫోన్ ప్రధాన హైలైట్. 6720mAh భారీ బ్యాటరీతో వస్తుంది. 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C పోర్ట్ లభిస్తాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, Hi-Res Audio సపోర్ట్ కూడా ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories