Free ChatGPT Plus : ఇక చాట్ జిపిటి ప్లస్ కూడా ఫ్రీ.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే

Published : Nov 18, 2026, 02:02 PM ISTUpdated : Nov 18, 2026, 02:19 PM IST

Free ChatGPT Plus : చాట్‌జీపీటీ ప్లస్ సేవలను ఏడాది పాటు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని ఓపెన్ఏఐ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ రాదు. మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు? దానికి ఎలాంటి అర్హతలు కావాలి? అనే వివరాలు చూద్దాం.

PREV
15
ఏడాది పాటు ఫ్రీగా చాట్ జిపిటి ప్లస్

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఏఐ వాడుతున్నారు… చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అదీఇదని కాదు అన్నింటికీ దీనిపైనే ఆధారపడుతున్నారు. కొన్ని సంస్థలు ఏఐ ని ఉచితంగా అందిస్తున్నాయి… కానీ స్పెషల్ సర్విసెస్ కోసం మాత్రం కొంత డబ్బు వసూలుచేస్తున్నాయి.

ఓపెన్ ఏఐ సంస్థ కూడా చాట్ జిపిటిని ఉచితంగా అందిస్తుంది… కానీ ప్రత్యేక సేవల కావాలంటే మాత్రం నెలనెలా డబ్బులుకట్టి చాట్‌జీపీటీ ప్లస్ (ChatGPT Plus) వాడాల్సి ఉంటుంది. మరి ఈ సేవలు ఏడాది పాటు ఉచితంగా వస్తే ఎలా ఉంటుంది? ఇదే జరగబోతోంది.

పరిశోధనల్లో ఉండేవాళ్ల కోసం ఓపెన్ఏఐ (OpenAI) ఈ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇండియాలోనూ అందుబాటులోకి తెచ్చిన 'ChatGPT for Academic Researchers' ప్రోగ్రామ్ కింద అర్హులైన రీసెర్చర్లకు 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50,000 కొత్త గ్రాంట్లను ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా గరిష్ఠంగా రెండు లక్షల మంది పరిశోధకులకు సర్వీస్ అందించాలన్నది టార్గెట్.

25
ఒకేసారి ముగ్గురికి ఆఫర్

ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యే ప్రతి రీసెర్చ్ గ్రూప్‌కీ మూడు చాట్‌జీపీటీ ప్లస్ అకౌంట్స్ ఇస్తారు. అంటే అప్లై చేసిన ప్రధాన వ్యక్తితో పాటు, తనతో పనిచేసే మరో ఇద్దరు కూడా ఈ సేవలు వాడుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన రీసెర్చ్ వర్క్‌స్పేస్ క్రియేట్ చేస్తారు. సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ల కోసం వెతకడం, కొత్త ఐడియాలను డెవలప్ చేసి టెస్ట్ చేయడం, డేటా ఎనలైజ్ చేయడం, కంప్యూటర్ కోడ్స్ రాయడం, రీసెర్చ్ పేపర్లు, ఫండ్స్ అప్లికేషన్లు రెడీ చేయడం లాంటి పనుల్లో చాట్‌జీపీటీ భలే ఉపయోగపడుతుంది.

35
అందరికీ ఫ్రీ కాదు... మరి ఎవరికి?

ఈ ఆఫర్ కావాలనుకున్నవాళ్లంతా డైరెక్ట్‌గా అప్లై చేయడానికి కుదరదు. గుర్తింపు పొందిన విద్యాసంస్థలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా లేదా పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేస్తూ ఉండాలి. బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ అండ్ మెటీరియల్స్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ లాంటి రంగాల్లో రీసెర్చ్ చేసేవాళ్లకే ఈ అవకాశం. పైగా గత మూడేళ్లలో సంబంధిత సబ్జెక్టులో రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేసి ఉండాలి. అర్హతలు ఉన్నంత మాత్రాన ఎంపికవుతారన్న గ్యారంటీ లేదు సుమా!

45
50,000 మందికే ఛాన్స్

OpenAI అఫీషియల్ గ్లోబల్ అనౌన్స్‌మెంట్ ప్రకారం.. తర్వాతి రౌండ్ అప్లికేషన్లు నవంబర్ 23 నుంచి మొదలవుతాయి. అర్హతలున్న తొలి 50,000 అప్లికేషన్లకే ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. అయితే నవంబర్ 30 నుంచి అప్లికేషన్లు మొదలవుతాయని కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి… కాబట్టి మన ఇండియా వాళ్లు అఫీషియల్ అప్లికేషన్ పేజీలో డేట్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిన గ్రూప్‌లకు 12 నెలల పాటు ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్ యాక్సెస్ దొరుకుతుంది.

55
పరిశోధకులకు ఇంకా ఏంటి లాభం?

ఈ ప్రోగ్రామ్‌లో షేర్ చేసే డేటాను డీఫాల్ట్‌గా OpenAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ట్రైనింగ్ కోసం వాడమని కంపెనీ చెప్పింది. అంతేకాదు రీసెర్చ్ పనుల్లో చాట్‌జీపీటీని ఎలా వాడాలో ట్రెయినింగ్, గైడెన్స్ కూడా ఇస్తారు.

అయితే ఇది పర్సనల్ చాట్‌జీపీటీ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసే ఆఫర్ కాదు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ వర్క్‌స్పేస్ తయారు చేస్తారు. ఆ వర్క్‌స్పేస్‌లోని డేటాను మేనేజ్ చేసే పవర్ అడ్మిన్ల చేతిలో ఉంటుంది. కాబట్టి అప్లై చేసేముందే అర్హతలు, డేటా సేఫ్టీ, ప్రోగ్రామ్ రూల్స్‌ని పూర్తిగా చదువుకోవడం చాలా ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories