
మీ టీనేజ్ పిల్లల చేతిలో పెట్టే తొలి స్మార్ట్‌ఫోన్ వారికి ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే. బాక్స్ ఓపెన్ చేయడం నుంచి ఫోన్ ఆన్ చేసే వరకు ఆ ఎగ్జైట్‌మెంట్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అనగానే భారీ ధర పెట్టాల్సిన అవసరం లేదు. పేరెంట్స్‌తో టచ్‌లో ఉండటానికి, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడానికి, స్టడీ నోట్స్ షేర్ చేసుకోవడానికి, సోషల్ మీడియా వాడుకోవడానికే ఎక్కువగా ఫోన్ కొనిస్తుంటారు.
అందుకే బడ్జెట్ ధరలో మంచి ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవడం స్మార్ట్ ఛాయిస్. మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్స్ ఉండటంతో ఏది బెస్ట్ అని తేల్చుకోవడం కాస్త కష్టమే. ధర తక్కువైనా సరే.. మంచి స్టోరేజ్, బ్రైట్ స్క్రీన్, రోజంతా వచ్చే బ్యాటరీ, డీసెంట్ కెమెరా, గేమింగ్ పెర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ ఉండాలని పిల్లలు కోరుకుంటారు.
మీ సెర్చ్‌ను సింపుల్ చేయడానికి, పాపులర్ బ్రాండ్స్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాం.
దీని ధర - రూ.20,600.
స్పెషల్స్ - చాలా ఏళ్ల పాటు మన్నికగా ఉండే ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే శాంసంగ్ దీనికి 2031 వరకు (6 ఏళ్లు) ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తోంది. 6.7 ఇంచుల బ్రైట్ అమోలెడ్ (AMOLED) స్క్రీన్, పవర్ బటన్‌లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
పెర్ఫార్మెన్స్ & సెక్యూరిటీ - 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వస్తుంది. (మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో స్టోరేజ్ పెంచుకోవచ్చు, స్టోరేజ్‌ను ర్యామ్‌గా కూడా వాడుకోవచ్చు). పిల్లలు ఫోన్ ఎంతసేపు వాడుతున్నారో పేరెంట్స్ చెక్ చేయడానికి 'Google Family Link' సపోర్ట్ ఉంది.
కెమెరా & బ్యాటరీ - వెనుకవైపు 50 MP, 5 MP, 2 MP కెమెరాలు ఉన్నాయి. 5,000 mAh బ్యాటరీ రోజంతా పక్కాగా వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, గెలాక్సీ ఏఐ లేకపోయినా.. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్లు ఇచ్చారు.
దీని ధర - 8GB/128GB వేరియంట్ రూ.42,000, 256GB వేరియంట్ రూ.50,400.
స్పెషల్స్ - ఇన్‌బిల్ట్ స్టైలస్ పెన్‌తో వస్తున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇది. వీడియో ఎడిటింగ్, డ్రాయింగ్, గేమింగ్ ఇష్టపడే పిల్లలకు బాగా సెట్ అవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, 3.5mm ఆడియో జాక్ కూడా ఉన్నాయి.
స్క్రీన్ & ఏఐ ఫీచర్లు - 6.7 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. జెమినీ, కోపైలట్, పర్‌ప్లెక్సిటీ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. హ్యాండ్‌రైటింగ్ క్యాలిక్యులేటర్, స్కెచ్ టు ఇమేజ్ ఫీచర్లు స్టూడెంట్స్‌కు బాగా యూజ్ అవుతాయి.
బ్యాటరీ - 5,200 mAh బ్యాటరీ నార్మల్ వాడకంతో దాదాపు 2 రోజులు వస్తుంది. 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మాత్రమే రావడం కాస్త మైనస్.
దీని ధర - రూ.28,500.
స్పెషల్స్ - పెట్టిన డబ్బులకు తగ్గ వాల్యూ ఇచ్చే ఫోన్ ఇది. 6 ఏళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 6.7 ఇంచుల బ్రైట్ డిస్‌ప్లేతో దీన్ని తీసుకొచ్చారు.
పెర్ఫార్మెన్స్ & కెమెరా - ప్లే స్టోర్‌లోని చాలా యాప్స్, గేమ్స్ ఇందులో స్మూత్‌గా రన్ అవుతాయి. కాలింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాతో 4K / 30fps క్వాలిటీలో వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.
బ్యాటరీ & ఏఐ - 5,000 mAh బ్యాటరీతో ఏకధాటిగా 16 గంటల పాటు వీడియోలు చూడొచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. సర్కిల్ టు సెర్చ్, ఫొటోల్లో వద్దనుకున్నవి తీసేసే ఆబ్జెక్ట్ ఎరేజర్, ఏఐ సెలెక్ట్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.
దీని ధర - 8GB/128GB మోడల్ రూ.41,900, 12GB/256GB మోడల్ రూ.50,300.
స్పెషల్స్ - భిన్నమైన డిజైన్, ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్ కోరుకునే యూత్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో రౌండ్ షేప్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉండటంతో గేమింగ్, స్పీడ్‌లో దూసుకుపోతుంది.
స్క్రీన్ & కెమెరా - 6.83 ఇంచుల పెద్ద అమోలెడ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. గూగుల్ పేరెంటల్ కంట్రోల్స్‌తో పాటు స్పెషల్ ఏఐ బటన్ ఇచ్చారు. ఈ ధరలో అరుదుగా కనిపించే 50 MP టెలిఫోటో లెన్స్ ఉండటంతో ఫొటోలు అదిరిపోతాయి.
బ్యాటరీ & సెక్యూరిటీ - 5,080 mAh బ్యాటరీకి తోడు 50W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఈ ఫోన్‌కు 3 మేజర్ ఓఎస్ అప్‌డేట్స్ వస్తాయి. స్విచ్ఛాఫ్ చేసే ముందు లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్ అడిగే బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్ ఇందులో ఉంది.
దీని ధర - రూ.16,800.
స్పెషల్స్ - చాలా తక్కువ బడ్జెట్‌లో మోడ్రన్ ఫీచర్లున్న ఫోన్ చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాయిస్. ధర తక్కువే అయినా.. వెనుకవైపు వీగన్ లెదర్ ఫినిషింగ్ ప్రీమియం లుక్ ఇస్తుంది. 6.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు.
మన్నిక & బ్యాటరీ - యూట్యూబ్, వీడియో కాల్స్ లాంటి రెగ్యులర్ వాడకానికి ఇది పర్ఫెక్ట్. 5,000 mAh బ్యాటరీకి 30W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. IP68/IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉండటంతో కాలేజీ స్టూడెంట్స్‌కు బాగా సెట్ అవుతుంది.
కెమెరా & స్టోరేజ్ - వెనుక 50 MP మెయిన్, 8 MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు ముందు 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. పగటి పూట ఫొటోలు బాగా వస్తాయి. ఆండ్రాయిడ్ 15తో వచ్చే ఈ ఫోన్‌లో 128GB స్టోరేజ్ ఇచ్చారు (1TB వరకు పెంచుకోవచ్చు).