Redmi Note: రెడ్మీ ప్రియులకు గుడ్ న్యూస్! షియోమీ త్వరలో తీసుకురాబోతున్న రెడ్మీ నోట్ 18 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ ఫీచర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
8,888mAh భారీ బ్యాటరీతో 'రెడ్మీ నోట్ 18 5జీ' వస్తుందా?
చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) ఈ ఏడాది మొదట్లో రెడ్మీ నోట్ 17 సిరీస్ (Redmi Note 17 Series) ఫోన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మిడ్-రేంజ్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ, నెక్స్ట్ రెడ్మీ నోట్ 18 సిరీస్ (Redmi Note 18 Series) లాంచ్‌కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, చైనా, గ్లోబల్ మార్కెట్లలో రానున్న స్టాండర్డ్ రెడ్మీ నోట్ 18 5జీ (Redmi Note 18 5G) మోడల్ బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించిన కొత్త వివరాలు లీక్ అయ్యాయి. అలాగే, ఈ కొత్త సిరీస్‌లో రెడ్మీ నోట్ 18 ప్రో (Redmi Note 18 Pro), రెడ్మీ నోట్ 18 ప్రో మ్యాక్స్ (Redmi Note 18 Pro Max) మోడల్స్ కూడా ఉండొచ్చని అంచనా.
24
రెడ్మీ నోట్ 18 5జీ బ్యాటరీ వివరాల లీక్
ప్రముఖ టిప్‌స్టర్ PaperKing13 ఎక్స్ (X) ప్లాట్ఫామ్లో వెల్లడించిన ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్మీ నోట్ 17 5జీ మోడల్‌కే కాస్త పేరు మార్చి (Rebranded) రెడ్మీ నోట్ 18 5జీగా తీసుకురానున్నారని సమాచారం. హార్డ్‌వేర్ పరంగా చూస్తే కేవలం బ్యాటరీ సామర్థ్యాన్ని మాత్రమే పెంచనున్నారని తెలుస్తోంది.
టిప్‌స్టర్ షేర్ చేసిన 'బిల్డ్ ప్రాపర్టీ' (Build Property) స్క్రీన్‌షాట్స్ బట్టి, దీని చైనా వేరియంట్ "మిస్ట్" (mist) అనే కోడ్ నేమ్‌తో, M077CE అనే మోడల్ నంబర్‌తో ఉంది. దేశీయ మార్కెట్ జాబితాలో స్టాండర్డ్ రెడ్మీ నోట్ 18, రెడ్మీ నోట్ 18 5జీ, పోకో ఎం8 పవర్ 5జీ (Poco M8 Power 5G) పేర్లు కూడా కనిపించాయి. చైనాలో లాంచ్ అయ్యే రెడ్మీ నోట్ 18 5జీ మోడల్లో 8,888mAh (BN84) బ్యాటరీ ఉంటుందని అంచనా. గతంలో వచ్చిన రెడ్మీ నోట్ 17 5జీలో ఉన్న 8,000mAh (BM79) బ్యాటరీ కంటే ఇది చాలా పవర్ఫుల్.
34
గ్లోబల్ వేరియంట్ బ్యాటరీ & ఛార్జింగ్ స్పీడ్
గ్లోబల్ వేరియంట్ (Global Variant) రెడ్మీ నోట్ 18 5జీ మోడల్లో 8,100mAh (BN85) బ్యాటరీ ఉంటుందని చెబుతున్నారు (పాత మోడల్లో 7,700mAh BM7A బ్యాటరీ ఉంది). అయితే, ఈ రెండు వేరియంట్లలో వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ (Wired Fast Charging) స్పీడ్‌లో ఎలాంటి మార్పు లేదు. రెడ్మీ నోట్ 17 5జీ లాగానే 45W ఛార్జింగ్ సపోర్ట్ కంటిన్యూ అవుతుందని సమాచారం.
ఈ లీక్స్ ప్రకారం, స్టాండర్డ్ రెడ్మీ నోట్ 18 5జీలో బ్యాటరీ కెపాసిటీ తప్ప పెద్ద హార్డ్‌వేర్ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. అంతకుముందు వచ్చిన సర్టిఫికేషన్ ఫైలింగ్స్ (Certification filings) ప్రకారం, రెడ్మీ నోట్ 18 సిరీస్ కింద 3 మోడల్స్ తయారవుతున్నాయి. ముఖ్యంగా రెడ్మీ నోట్ 18 ప్రో మ్యాక్స్ మోడల్లో ఏకంగా 10,000mAh బ్యాటరీ ఇస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
రెడ్మీ నోట్ 17 స్మార్ట్‌ఫోన్ గతేడాది జూలైలో చైనాలో, ఆగస్టులో ఇండియాలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 27,999. ఇందులో 6.9 అంగుళాల AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) ప్రాసెసర్‌పై రన్ అయ్యే ఈ ఫోన్, 8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది.