Nano Banana: ఇక‌పై వాట్సాప్‌లోనే నానో బ‌నానా.. ఎలా ప‌నిచేస్తుంది.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Published : Sep 19, 2025, 03:59 PM IST

Nano Banana: ఇటీవ‌ల నానో బ‌నానా ట్రెంబ్ భారీగా పెరిగింది. ఏఐ స‌హాయంతో ఫొటోల‌ను న‌చ్చినట్లు మార్చుకుని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఈ సేవ‌ల‌ను ఇప్పుడు మ‌రింత సుల‌భ‌త‌రం చేశారు. 

PREV
15
వినూత్న ఫీచ‌ర్

ప్ర‌ముఖ ఏఐ సంస్థ Perplexity తాజాగా వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. Google Gemini 2.5 Flash Image (Nano Banana పేరుతో ప్రసిద్ధి చెందినది) తరహా సౌకర్యాన్ని ఇప్పుడు WhatsApp బాట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో WhatsApp ద్వారా నేరుగా AI ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ సదుపాయం లభిస్తోంది.

25
వాట్సాప్‌లో నానో బ‌నానా

Perplexity ప్రత్యేకంగా ఒక WhatsApp నంబర్‌ (+1 (833) 436-3285)ను అందించింది. వినియోగదారులు ఆ బాట్‌తో "హాయ్" అని చాట్ ప్రారంభించి తమ ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఎలాంటి మార్పులు కావాలో స్పష్టంగా ప్రాంప్ట్ ఇవ్వగానే, AI ఆధారంగా కొత్త ఫలితాలను పొందవచ్చు.

35
ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

Gemini AIలో లాగే, ఇక్కడ కూడా ఇమేజ్ ఎడిటింగ్ పూర్తిగా ప్రాంప్ట్‌లపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇచ్చే వివరణ ఎంత స్పష్టంగా ఉంటే, ఫోటో క్వాలిటీ, ఫైనల్ అవుట్‌పుట్ అంత మెరుగ్గా వస్తుంది. చిన్నచిన్న ఎడిటింగ్‌లు, సింపుల్ మార్పులు ఉచితంగానే సాధ్యమవుతాయి.

45
ప్రో వెర్షన్ అవసరమా?

Nano Banana అనేది అసలు Gemini 2.5 Proలో భాగం. కాబట్టి మరింత అధునాతన ఎడిటింగ్ ఫలితాలు కావాలంటే Perplexity Pro సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఉచిత WhatsApp బాట్ సాధారణ ఉపయోగానికి సరిపోతుంది. కానీ ప్రొఫెషనల్ అవుట్‌పుట్ కోరుకునే వారికి సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి.

55
ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు ఉచితం

భారత్‌లో Perplexity, Airtel‌తో జట్టు కట్టి 12 నెలల పాటు ఉచిత Pro సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. దీని ద్వారా GPT, Gemini, Claude వంటి ప్రీమియం AI మోడళ్లను వినియోగించే అవకాశముంది. Airtel కస్టమర్లకు ఇది ఒక ప్రత్యేక అదనపు లాభంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories