Google Discover: గూగుల్ తన Discover Feed కు మరో కొత్త ఫీచర్‌ని జోడించింది. ఇప్పుడు యూజర్లు తమకు నచ్చిన వెబ్‌సైట్లు, క్రియేటర్లు, న్యూస్ పోర్టల్స్‌ను నేరుగా ఫాలో అవ్వగలరు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
గూగుల్ ప్రకటించిన కొత్త అప్‌డేట్‌లో ముఖ్యమైన మార్పు Follow Button. ఇది న్యూస్ కార్డ్‌లో ఎడమ పై భాగంలో కనిపిస్తుంది. మీరు ఈ బటన్‌ను నొక్కితే, ఆ న్యూస్ పోర్టల్ లేదా క్రియేటర్‌ను నేరుగా ఫాలో చేయొచ్చు. ఫాలో చేసిన తర్వాత, వారి కథనాలు, వీడియోలు, పోస్టులు మీ Discover Feedలో ఎక్కువగా కనిపిస్తాయి. ఏషియానెట్ తెలుగుకు కూడా ఫాలో బటన్ అందుబాటులోకి వచ్చేసింది.
25
వెబ్‌సైట్లు, సోషల్ మీడియా కంటెంట్ మరింతగా
ఇకపై గూగుల్ డిస్కవర్ కేవలం వార్తలే కాకుండా, YouTube వీడియోలు, Shorts, X (Twitter) పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ కనిపించనుంది. దీని వల్ల వినియోగదారులు ఒకే చోట అన్ని రకాల కంటెంట్ చూడగలరు.
35
క్రియేటర్ లేదా న్యూస్ పోర్టల్ ప్రొఫైల్ ప్రివ్యూ
మీరు ఏదైనా క్రియేటర్ లేదా వెబ్‌సైట్ పేరు పై నొక్కితే, కొత్త Preview Page తెరుచుకుంటుంది. ఇక్కడ వారి తాజా ఆర్టికల్స్, వీడియోలు, బ్లాగ్స్ కనిపిస్తాయి. అలాగే వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌కి లింకులు కూడా ఉంటాయి. ఇలా మీరు ఆ క్రియేటర్ లేదా వెబ్‌సైట్ గురించి పూర్తి సమాచారం పొందగలరు.
ఇప్పటికే గూగుల్ సర్చ్‌లో ఒక వెబ్‌సైట్‌ను Preferred News Source గా సెట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆ ఫీచర్ మరింత బలపడింది. దీంతో యూజర్లు ఏషియానెట్ తెలుగు వంటి పోర్టల్స్‌ను ఫాలో చేస్తే, వాటి కథనాలు మీ ఫీడ్‌లో క్రమం తప్పకుండా కనిపిస్తాయి.
55
రీడర్స్‌కి జరిగే లాభం ఏంటి.?
ఏషియానెట్ తెలుగు వంటి ప్లాట్‌ఫామ్స్‌ను గూగుల్ డిస్కవర్‌లో నేరుగా ఫాలో అవ్వొచ్చు. దీంతో ఏషియానెట్ తెలుగు పాఠకులు, వారి ఇష్టమైన కథనాలు, వార్తలు, విశ్లేషణలు నేరుగా గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో చూడగలరు. ఇది పాఠకులకు మరింత సులభతరం, సౌకర్యవంతంగా ఉంటుంది.