Mouse: ష్‌..! మీ కంప్యూట‌ర్ మౌస్ మీ మాట‌లు వింటోంది.? ప‌రిశోధ‌న‌ల్లో షాకింగ్ విష‌యాలు

Published : Oct 11, 2025, 04:06 PM IST

Mouse: ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మ‌నుషుల మాట‌ల‌ను సైలెంట్‌గా వింటాయ‌ని విని ఉంటాం. అయితే మౌస్‌లు కూడా మ‌నం మాట్లాడుకునే మాట‌లు వింటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టారు. 

PREV
15
మౌస్ మైక్‌గా మారుతుందా?

సాధారణంగా మనం మౌస్‌ని స్క్రోల్‌ చేయడానికి, క్లిక్‌ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ UC పరిశోధకులు చెబుతున్నట్టు, మౌస్‌లోని సెన్సర్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సెన్సర్లు చుట్టుపక్కల చిన్న వైబ్రేషన్లను కూడా గుర్తించగలవు. దీనిపై ప‌రిశోధ‌కులు ‘Mic-E-Mouse’ అనే పద్ధతిలో ప్రయోగం చేశారు. దాంతో మౌస్ సెన్సర్లు మన వాయిస్ వల్ల ఏర్పడే కంపనాలను ఆధారం చేసుకొని మాటల ధ్వనిని రికార్డు చేయగలవని తేలింది.

25
ఈ Mic-E-Mouse టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

పరిశోధకులు చెబుతున్న ప్రకారం, మౌస్‌లోని ఆప్టికల్ సెన్సర్లు చాలా సెన్సిబుల్‌గా ఉంటాయి. ఇవి మ‌నం మాట్లాడే స‌మ‌యంలో వ‌చ్చే సూక్ష్మ కంపనాలను ప‌ట్టుకుంటాయి. అవి డిజిటల్ సిగ్నల్‌లుగా మారి ఆడియో తరహాలో రూపాంతరం చెందుతాయి. ఈ విధానంలో 61% వరకు మాటల అర్థం తెలుసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. అంటే వంద శాతం క‌చ్చితంగా మాట‌లు తెలియ‌క‌పోయినా.. వ్య‌క్తిగ‌త ప్రైవసీకి పెద్ద ముప్పు అని చెబుతున్నారు.

35
భద్రతా వ్యవస్థలు ఎందుకు గుర్తించలేవు?

సాధారణ యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లు లేదా సెక్యూరిటీ సిస్టమ్స్‌ మౌస్ వంటి పరికరాలను స్కాన్ చేయవు. అందువల్ల హ్యాకర్లు ఈ సెన్సర్లను ఉపయోగించి సమాచారం దొంగిలించినా కూడా, సెక్యూరిటీ అలర్ట్‌లు రాకపోవచ్చు. ఇది మౌస్‌ను ఒక రహస్య గూఢచారి పరికరంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

45
నిజంగానే మౌస్ స్పై చేస్తుందా?

మౌస్ స్పైగా ప‌నిచేయాలంటే అందుకోసం ముందుగా హ్యాకర్‌ మీ సిస్టమ్‌లో మాల్వేర్ లేదా వైరస్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీరు ఎలాంటి అనుమానిత లింక్‌లు క్లిక్ చేయ‌క‌పోతే మీకు ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌దు. అయినా ఈ పరిశోధన మనకు ఒక వేక్-అప్ కాల్ లాంటిద‌ని నిపుణులు అంటున్నారు. మన ఇంట్లో ఉన్న పరికరాలు కూడా మ‌న మాట‌లు వింటాయ‌న్న వాద‌న‌కు బ‌లం చేకూర్చుతున్నాయి.

55
ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి.?

ఇలాంటి వాటిన బారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే అనుమానాస్పద లింకులు, ఫైళ్లను ఓపెన్ చేయ‌కూడ‌దు. అనధికారిక యాప్స్ లేదా గేమ్స్ ఇన్‌స్టాల్ చేయకండి. యాంటీవైరస్ ప్రొటెక్షన్‌ను అప్‌డేట్‌గా ఉంచండి.

Read more Photos on
click me!

Recommended Stories