Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్.. ఐఫోన్ 16, నథింగ్ ఫోన్ 3 పై బిగ్ డిస్కౌంట్

Published : Oct 10, 2025, 11:58 PM ISTUpdated : Oct 11, 2025, 12:07 AM IST

Flipkart Big Bang Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ అక్టోబర్ 11 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 16, నథింగ్ ఫోన్ 3 తో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి.

PREV
15
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ ప్రారంభం

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన తాజా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ ఒక రోజు ముందుగానే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే, శనివారం నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ అక్టోబర్ 24, 2025 వరకు కొనసాగనుంది.

ఇది బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale) తర్వాత ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న మరో ప్రధాన ఫెస్టివ్ సేల్. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్‌ సహా అనేక విభాగాల్లో భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి.

25
ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ పై భారీ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16) సిరీస్ పై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ లో ఐఫోన్ 16 ₹54,999 ధరతో అందుబాటులో ఉంది. దీని అసలు ధర ₹79,900. అలాగే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ₹1,02,999 లకు లభిస్తోంది. దీని అసలు ధర ₹1,44,900. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న సూపర్ డీల్స్ గా ఉన్నాయి.

35
నథింగ్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులు

ఈ సేల్ లో నథింగ్ 3 (Nothing Phone 3), నథింగ్ 3ఏ ప్రో (Nothing Phone 3a Pro) మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ 3 ఈ సేల్ లో ఆఫర్లతో కలుపుకుని ₹34,999 ధరకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర ₹79,999. అలాగే, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్ అందిస్తోంది. ఇక నథింగ్ ఫోన్ 3ఏ ప్రో కూడా ఈ సేల్ లో 5 వేల తగ్గింపుతో ₹24,999 అందుబాటులో ఉంది.

45
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) ఫోన్లపై తగ్గింపు

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (Google Pixel 10 Pro Fold), గూగుల్ పిక్సెల్ 9 ఫ్రో ఫోల్డ్ (Pixel 9 Pro Fold) ఫోన్లపై కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ లో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ₹1,57,999 ధరకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర ₹1,72,999. ఇందులో ₹10,000 బ్యాంక్ డిస్కౌంట్, ₹5,000 ట్రేడ్-ఇన్ బోనస్ లు ఉన్నాయి. ఇక గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ సేల్ ధర ₹84,999 గా ఉంది. దీని అసలు ధర ₹1,72,999. 10% బ్యాంక్ డిస్కౌంట్, ₹5,000 ట్రేడ్-ఇన్ బోనస్ అందిస్తోంది.

55
శాంసంగ్, మోటరోలా ఫోన్లపై భారీ ఆఫర్లు

ఈ సేల్ లో శాంసంగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్ల ఫోన్ల పై కూడా మంచి ఆపర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలక్సీ ఎస్ 24 ఎఫ్ఈ (Samsung Galaxy S24 FE), గెలక్సీ ఎస్ 24 (Galaxy S24) మోడళ్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఎస్ 24 ఎఫ్ఈ ని ఈ సేల్ లో మీరు ₹29,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర ₹59,999. గెలక్సీ ఎస్ 24 ఈ సేల్ లో ₹38,999 ధరకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర ₹74,999.

ఇక మోటరోలా ఫోన్ల పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. రేజర్ 60 పదివేల తగ్గింపుతో ₹39,999 కు అందుబాటులో ఉంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ₹18,999 ధరకు అందుబాటులో ఉంది. ప్రో మోడల్ ₹24,999 గా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories