Moltbook: ఈ సోష‌ల్ మీడియా సైట్ మ‌నుషుల కోసం కాదు రోబోల కోసం.. ఎలా ప‌నిచేస్తుందంటే

Published : Jan 31, 2026, 04:58 PM IST

Moltbook:సోష‌ల్ మీడియా సైట్స్‌ను మ‌నుషులు ఉప‌యోగిస్తార‌ని తెలిసిందే. అయితే ఏఐ ఏజెంట్స్ కోసం మాల్ట్‌బుక్ పేరుతో ఓ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్పుడు దీని గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది.

PREV
15
Moltbook అంటే ఏంటి?

Moltbook అనేది సాధారణ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కాదు. ఇది పూర్తిగా AI బాట్స్‌తోనే నడిచే సోషల్ నెట్‌వర్క్. ఇందులో మనుషులు పోస్టులు చేయరు. అన్ని పోస్టులు, కామెంట్లు, అప్‌వోట్స్ అన్నీ కేవలం AI ఏజెంట్లే చేస్తాయి. మనుషులకు కేవలం వీటిని చూడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది.

25
ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎవరు తయారు చేశారు?

Moltbook‌ను మ్యాట్ ష్లిచ్ట్ అనే వ్యక్తి ప్రారంభించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వెబ్‌సైట్ కోసం ఆయన ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేదు. తన AI అసిస్టెంట్ సహాయంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఇది కేవలం ఒక ప్రయోగంగా మొదలైంది.

35
మొత్తం బాధ్యత AI చేతుల్లోనే

మ్యాట్ ష్లిచ్ట్ తన AI అసిస్టెంట్‌కు Claude Clodberg అనే పేరు పెట్టారు. ఈ బాట్ కొత్త పోస్టులను గమనిస్తుంది, కొత్తగా వచ్చే బాట్స్‌ను స్వాగతిస్తుంది, ప్రకటనలు విడుదల చేస్తుంది. స్పామ్ కనిపిస్తే తొలగిస్తుంది. నియమాలు ఉల్లంఘిస్తే షాడో బ్యాన్ కూడా వేస్తుంది. ఇవన్నీ పూర్తిగా ఆటోమేటిక్‌గా జరుగుతాయి. మనుషుల జోక్యం ఉండదు.

45
సోషల్ మీడియాలో పెద్ద చర్చ

Moltbook గురించి తెలిసిన వెంటనే X ప్లాట్‌ఫామ్‌లో పెద్ద చర్చ మొదలైంది. చాలా మంది దీనిని భవిష్యత్తు సోషల్ మీడియా అంటూ మాట్లాడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇది భయంకరమైన ప్రయోగం అంటున్నారు. టెక్ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు.

55
ఎలాన్ మస్క్ ఎలా స్పందించారు?

ఎలాన్ మస్క్ Moltbook గురించి నేరుగా స్పందించ‌లేదు. అయితే ఒక ఆసక్తికర ఘటనపై స్పందించారు. ఒక Moltbook బాట్ మరో బాట్ API కీ దొంగిలించేందుకు ప్రయత్నించిన పోస్టును ఒక టెక్ వ్యవస్థాపకుడు షేర్ చేయగా, మస్క్ నవ్వుతున్న ఎమోజీతో స్పందించారు. ఇది ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆయన ఆసక్తిని సూచిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే.. Moltbook అనేది మనుషుల కోసం కాదు. ఇది AIలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే ప్రపంచం. భవిష్యత్తులో సోషల్ మీడియా ఏ దిశగా వెళ్లబోతోందో చూపించే ప్రయోగంగా దీనిని చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories