Smartphone: స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య బ్యాటరీ. చాలా మంది బ్యాటరీ పనితీరుతో ఇబ్బంది పడుతుంటారు. మీరు చేసే కొన్ని తప్పుల వల్లే మీ బ్యాటరీ త్వరగా పాడువుతుందని మీకు తెలుసా.?
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క రోజు కూడా గడపలేని పరిస్థితి. ఉదయం లేవగానే మొదలుకుని రాత్రి నిద్రపోయే వరకూ ఫోన్ చేతిలోనే ఉంటుంది. కానీ ఫోన్‌ను ఎలా చార్జ్ చేస్తున్నాం అనే విషయంలో చాలామంది పట్టించుకోవడం లేదు. ఇదే అలవాటు బ్యాటరీ ఆయుష్షును ఒక ఏడాదిలోపే తగ్గిస్తోంది.
25
నైట్ అంతా చార్జింగ్ పెట్టడం ఎంత ప్రమాదకరం
నిద్రకు ముందు ఫోన్‌ను చార్జింగ్‌కు పెట్టి, ఉదయం తీయడం చాలా మందికి అలవాటు. కానీ ఇది బ్యాటరీకు పెద్ద ప్రమాదకరం. 100 శాతం చార్జ్ అయిన తర్వాత కూడా కరెంట్ వెళ్లడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఈ వేడి కారణంగా లోపలి సెల్స్ నెమ్మదిగా దెబ్బతింటాయి. మొదట్లో సమస్య కనిపించదు. కొన్ని నెలల తర్వాత చార్జ్ వేగంగా తగ్గడం మొదలవుతుంది.
35
నకిలీ చార్జర్ వాడితే వచ్చే నష్టం
అన్ని చార్జర్లు ఒకేలా ఉండవు. అసలు చార్జర్ కాకుండా చౌకగా దొరికే నకిలీ చార్జర్ వాడితే ఫోన్‌కు సరైన వోల్టేజ్ అందదు. ఫలితంగా బ్యాటరీ ఎక్కువ వేడి అవుతుంది. కొన్నిసార్లు చార్జింగ్ నెమ్మదిగా జరుగుతుంది. త్వరగా చార్జ్ అవుతోంది అని అనుకోవడం పొరపాటు. అది బ్యాటరీ బలహీనమవుతున్న సంకేతమే.
చార్జ్ పెట్టి వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, రీల్స్ స్క్రోల్ చేయడం బ్యాటరీపై భారీ ఒత్తిడి పెడుతుంది. ఒక వైపు కరెంట్ లోపలికి వెళ్తుంది. మరో వైపు ఎక్కువ శక్తి బయటకు వెళ్తుంది. దీంతో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఫోన్ వేడెక్కడం, అకస్మాత్తుగా ఆఫ్ అవడం వంటి సమస్యలు వస్తాయి.
55
బ్యాటరీ ఎక్కువ కాలం బాగుండాలంటే..
ఫోన్ బ్యాటరీ ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద మార్పులు అవసరం లేదు. 20 శాతం నుంచి 80 శాతం నడుమ చార్జ్ ఉంచడం మంచిది. అవసరం లేకుండా నైట్ చార్జింగ్ తప్పించాలి. అసలు చార్జర్ వాడటం అలవాటు చేసుకోవాలి. ఇవి చిన్న విషయాల్లా అనిపిస్తాయి. కానీ ఇవే బ్యాటరీ ఆయుష్షును పెంచుతాయి. ఇవాళ జాగ్రత్త తీసుకోకపోతే, ఏడాది తర్వాత బ్యాటరీ మార్చాల్సిన పరిస్థితి తప్పదు.