Hack: ప్రస్తుతం ఈయర్‌బడ్స్ వినియోగం అనివార్యంగా మారింది. వీడియోకాల్స్ మొదలు గేమింగ్ వరకు అన్నింటికీ వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే మీరు ఉపయోగిస్తున్న ఈయర్‌బడ్స్ ఎంత వరకు సురక్షితమో ఎప్పుడైనా ఆలోచించారా.?
ఈ రోజుల్లో వైర్‌లెస్ ఈయర్‌బడ్స్ జీవితంలో భాగమయ్యాయి. పాటలు వినడం, ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ అన్నింటికీ ఇవే ఆధారం. చాలా మంది ఇవి పూర్తిగా సేఫ్ అనుకుని ఎక్కడైనా వాడేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన సైబర్ రీసెర్చ్ ఈ నమ్మకాన్ని కుదిపేసింది.
25
ఫాస్ట్ పేర్ ఫీచర్‌లో ఉన్న లోపం
చాలా ఈయర్‌బడ్స్ లో Fast Pair అనే సౌకర్యం ఉంటుంది. ఇది ఫోన్ తో త్వరగా కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. కానీ సైబర్ నిపుణుల ప్రకారం, ఇదే ఫీచర్ లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. హ్యాకర్లు ఈ లోపాలను వాడుకుని ఈయర్‌బడ్స్ లోకి చొరబడే అవకాశం ఉంది.
35
‘విస్పర్ పేర్’ దాడి అంటే ఏమిటి?
బెల్జియంలోని KU Leuven యూనివర్సిటీ సైబర్ నిపుణులు ఈ దాడికి Whisper Pair అని పేరు పెట్టారు. ఈ పద్ధతిలో హ్యాకర్ 40 నుంచి 50 అడుగుల దూరంలో ఉన్నా కూడా ఈయర్‌బడ్స్‌కు కనెక్ట్ కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఫోన్ లో ఎలాంటి నోటిఫికేషన్ రాదు. యూజర్ కి అసలు విషయం తెలియదు.
హ్యాకర్ ఒకసారి ఈయర్‌బడ్స్‌తో కనెక్ట్ అయితే ఫోన్ కాల్స్ వినగలడు. కాల్ కట్ చేయగలడు. ఆడియో కంట్రోల్ తీసుకోగలడు. వ్యక్తిగత మాటలు రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఒంటరిగా వింటున్నామని అనుకుంటే, వేరే వ్యక్తి కూడా వింటుండవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ లొకేషన్ అంచనా వేసే అవకాశం ఉందని రీసెర్చ్ చెబుతోంది.
55
ఈయర్‌బడ్స్ వాడేవారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
అవసరం లేకపోతే బ్లూటూత్ ఆఫ్ చేయాలి. పబ్లిక్ ప్రదేశాల్లో ఈయర్‌బడ్స్ ద్వారా కాల్స్ చేయడం తగ్గించాలి. ఫోన్, ఈయర్‌బడ్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ గా ఉంచాలి. తెలియని డివైస్ కనెక్షన్ కి అనుమతి ఇవ్వకూడదు. సెక్యూరిటీ సెట్టింగ్స్ తరచూ చెక్ చేయాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.