జియో కస్టమర్స్.. మీరిక సిగ్నల్ లేకపోయినా ఇంటర్నెట్ వాడొచ్చు, కాల్స్ చేయొచ్చు, ఎలాగో తెలుసా?

Published : Nov 10, 2025, 12:38 PM ISTUpdated : Nov 10, 2025, 12:46 PM IST

Jio-BSNL : తమ వినియోగదారుల కోసం ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది రిలయన్స్ జియో. తాజాగా అసలు సిగ్నల్ లేకపోయినా వినియోగదారులకు సేవలందించేలా సరికొత్త ప్రయోగం చేసింది. 

PREV
15
మారుమూల ప్రాంతాల్లోని జియో కస్టమర్స్ కి గుడ్ న్యూస్...

Jio BSNL : ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తో చేతులు కలిపింది. ఇకపై జియో సిగ్నల్ లేకపోయినా సరే... బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ను జియో కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. ఇలా సరికొత్త ప్రయోగంతో టెలికాం రంగంలో మరో సంచలనానికి తెరతీసింది రిలయన్స్ జియో. 

25
బిఎస్ఎన్ఎల్ తో చేతులు కలిపిన జియో

భారతదేశంలో జియో సిగ్నల్ కవరేజ్ తక్కువగా ఉన్న లేదా సిగ్నల్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం రియలన్స్ ఈ చర్యలు చేపట్టింది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌ల ద్వారా జియో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయగలరు. జియో అందించే ప్రత్యేకమైన ప్లాన్‌లు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (Intra-Circle Roaming - ICR) ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తాయి. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్ తో మారుమూల ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ లేనప్పుడు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ ను కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు... అంటే సిగ్నల్ లేకపోయినా ఎలాంటి ఆటంకాలు ఉండవు.

35
ఈ రాష్ట్రాల్లో ప్రయోగం

ప్రస్తుతం ఈ కొత్త ICR రీఛార్జ్ ప్లాన్‌లు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని జియో వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. "జియో అందించే కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్‌లలో ఈ BSNL ICR సేవ అందుబాటులో ఉంది. దీని ద్వారా కస్టమర్లు నిర్దిష్ట ప్రదేశాలలో జియో సిగ్నల్ అందుబాటులో లేకుంటే BSNL నెట్‌వర్క్‌తో కనెక్ట్ కావచ్చు. తద్వారా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ వంటి సేవలను ఆటంకం లేకుండా వినియోగించుకోవచ్చు.." అని జియో ఓ ప్రకటనలో తెలిపింది. 

జియో, బిఎస్ఎన్ఎల్ కలయిక వల్ల ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి టెలికాం సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది... జియో కస్టమర్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం అటు జియోకు, ఇటు బిఎస్ఎన్ఎల్ కు లాభం చేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

45
కొత్త ICR రీఛార్జ్ ప్లాన్‌లు ఏవి?

జియో ప్రస్తుతం రూ.196, రూ.396 ధరలతో రెండు కొత్త ICR రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీ 28 రోజులు.

జియో BSNL ICR ప్లాన్ వివరాలు:

రూ. 196 ప్లాన్: ఈ ప్లాన్ ధర రూ. 196. ఇందులో వినియోగదారులకు 2GB డేటా, 1,000 నిమిషాల వాయిస్ కాల్స్, 1,000 ఎస్ఎంఎస్ లు 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి.

 రూ. 396 ప్లాన్: ఈ ప్లాన్ ధర రూ. 396. ఇందులో వినియోగదారులకు 10GB డేటా, 1,000 నిమిషాల వాయిస్ కాల్స్, 1,000 ఎస్ఎంఎస్ లు 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి.

ముఖ్య గమనిక: ఈ ప్లాన్‌లు జియో కస్టమర్స్ కేవలం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో ఉపయోగించడం కోసమే ప్రత్యేకమైనవి. అంటే వినియోగదారులు ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ ఐడియా వంటి ఇతర నెట్‌వర్క్‌లలో ఈ ప్లాన్‌లను ఉపయోగించలేరు.

55
ప్లాన్ ఎలా యాక్టివేట్ అవుతుంది?

వినియోగదారులు ఈ ICR రీఛార్జ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేసిన వెంటనే, అది క్యూలో (Queued Status) ఉంటుంది. వినియోగదారుడు మొదటిసారి వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ లేదా డేటా సేవను ఉపయోగించినప్పుడు ఈ ప్లాన్‌లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత ప్లాన్ దాని పూర్తి వ్యాలిడిటీ కాలానికి (28 రోజులు) యాక్టివ్‌గా ఉంటుంది. జియో కొత్త ప్లాన్‌లు సరైన నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో కూడా BSNL నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories