200MP ప్రో మోడల్ కెమెరాతో ఇండియాకు ఒప్పో Find X9 సిరీస్.. ధర ఎంతంటే?

Published : Nov 08, 2025, 10:46 PM ISTUpdated : Nov 08, 2025, 10:56 PM IST

Oppo Find X9 Series India : ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ నవంబర్ 18న భారత మార్కెట్ లోకి రానుంది. 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా సెటప్, 80W ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌గా అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది.

PREV
15
Oppo Find X9 Series : ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) తన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Find X9 భారత మార్కెట్లో నవంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. కంపెనీ ఎక్స్ లో చేసిన పోస్ట్ ద్వారా లాంచ్ వివరాలు వెల్లడించింది. లాంచ్ ఈవెంట్‌ను ఒప్పో ఇండియా అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఈ సిరీస్‌లో Find X9, Find X9 Pro మోడళ్లు ఉండనున్నాయి, ఇవి ఇప్పటికే చైనాలో విడుదలయ్యాయి.

25
Oppo Find X9 Series : స్పెషల్ ప్రివిలేజ్ ప్యాక్ ఆఫర్

ఒప్పో Find X9 సిరీస్ కొనుగోలుదారుల కోసం కంపెనీ ప్రివిలేజ్ ప్యాక్ ను కూడా ప్రకటించింది. ఇది ₹99 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో ₹1,000 విలువైన ఎక్స్చేంజ్ కూపన్, ఉచిత SUPERVOOC 80W అడాప్టర్, రెండు సంవత్సరాల బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లాన్ ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ Find X9 సిరీస్ యూనిట్‌తో పాటు అందిస్తారు.

35
Oppo Find X9, Find X9 Pro ఫీచర్లు

Find X9 లో 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండగా, ప్రో మోడల్‌లో 6.78 అంగుళాల ఫ్లాట్ OLED స్క్రీన్ ఉంటుంది. రెండు డిస్‌ప్లేలు కూడా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ (ColorOS) 16 పై రన్ అవుతాయి.

మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 9500 SoC, Arm G1-Ultra GPU చిప్ సెట్ కలిగి ఉన్నాయి. 16GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.

45
Oppo Find X9 Series : కెమెరా ఫీచర్లు

ఒప్పో Find X9 సిరీస్‌లో కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యంలో రూపొందించిన ఈ కెమెరా సెటప్‌లో Find X9 లో 50MP Sony LYT-828 ప్రైమరీ లెన్స్, 50MP Sony LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP శాంసంగ్ JN5 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఇక Find X9 Proలో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x డిజిటల్ జూమ్‌తో సపోర్టు ఉంటుంది. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా ఉంది.

55
Oppo Find X9 Series : బ్యాటరీ, ధర వివరాలు ఏంటి?

Find X9 లో 7,025mAh, Find X9 Pro లో 7,500mAh బ్యాటరీలు ఉన్నాయి. రెండూ 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. లీక్ అయిన ధరల ప్రకారం.. Find X9 (12GB RAM + 256GB) మోడల్ ధర సుమారు ₹74,999, Find X9 Pro ధర ₹99,999 వరకు ఉండవచ్చని సమాచారం.

ఈ ఫోన్లు శాంసంగ్ గెలక్సీ ఎస్ సిరీస్, వన్ ప్లస్, ఆపిల్ హైఎండ్ ఫ్లాగ్‌షిప్‌లకు పోటీగా వస్తున్నాయి. Find X9 సిరీస్ ప్రీమియం డిజైన్, పెద్ద బ్యాటరీ, హాసెల్‌బ్లాడ్ కెమెరా, కలర్ ఓఎస్ 16 వంటి ఫీచర్లతో మార్కెట్ లో తన వాటాను మరింత పెంచుకోవాలని చూస్తోంది. నవంబర్ 18న అధికారిక లాంచ్ ఈవెంట్ లో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories