మీరు ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతుంటారా? అయితే కొన్నిసార్లు డేటా లిమిట్ అయిపోవడంతో ఇంటర్నెట్ నిలిచిపోయిన అనుభవం మీకు ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉచితంగా బోనస్ డేటా పొందవచ్చు. ఈ ఆఫర్ ఎవరికో తెలుసా?
స్మార్ట్ ఫోన్ వాడే ఎవరైనా ప్రతిరోజు కొంత ఇంటర్నెట్ డేటా లిమిట్ తో మంత్లీ లేదా క్వాటర్లీ లేదంటే ఇయర్లీ రీచార్జ్ ప్లాన్ ఎంచుకుంటారు. తక్కువ డేటా వాడుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ డేటా వాడుకునేవారికి ఓ ఇబ్బంది ఉంటుంది. డేటా లిమిట్ అయిపోగానే ఇంటర్నెట్ ఆగిపోతుంది.. ఆన్లైన్ పనులు, ఆఫీస్ మెయిల్స్, వాట్సాప్ అప్‌డేట్స్, సోషల్ మీడియా వాడకం నిలిచిపోతుంది. దీంతో ఎక్స్ట్రా డేటా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇలా మళ్లీమళ్లీ రీచార్జ్ చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని… అలాగని ఇంటర్నెట్ వాడకుంటే పనులు కావు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చింది.
రిలయన్స్ జియో యూజర్లు అదనపు డేటా రీచార్జ్ అవసరం లేకుండానే రోజువారి డేటా లిమిట్ అయిపోయినా నాన్ స్టాప్ ఇంటర్నెట్ పొందవచ్చు. ఇలా ఉచితంగా బోనస్ రీచార్జ్ అందించే రీచార్జ్ ప్లాన్స్ ను జియో సిద్దం చేసింది. ఇలాంటి సూపర్ రీచార్జ్ ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
25
5 జీబీ డేటా ఉచితంగా అందించే జియో రీచార్జ్ ప్లాన్ ఇదే..
జియో కస్టమర్లు రూ.459తో రీఛార్జ్ చేసుకుంటే రోజూ 2GB డేటా చొప్పున 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 56GB డేటా వస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు జియో బోనస్‌గా 5GB డేటాను ఉచితంగా అందిస్తోంది… అంటే రోజువారి డేటా లిమిట్ పూర్తయితే ఈ 5GB డేటా వాడుకోవచ్చన్నమాట. మొత్తంగా 28 రోజులకు 61GB డేటా లభిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ లో డేటాతో పాటు 100 SMS, జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రో, జియో హాట్‌స్టార్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
35
ఏకంగా 20 జీబీ ఉచిత బోనస్ డేటా..
జియో కస్టమర్లు రూ.749 లేదా రూ.899 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే మూడు నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లలో రోజూ 2GB డేటా వస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా అయిపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ ప్లాన్ లో అదనంగా 20GB బోనస్ డేటా లభిస్తుంది. అవసరమైనప్పుడు ఈ డేటాను వాడుకోవచ్చు.
జియో కస్టమర్లు రూ.495 లేదా రూ.545 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే, రోజూ వరుసగా 1.5GB, 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మీ రోజువారీ డేటా కోటా అయిపోయిన తర్వాత, అదనంగా లభించే 5GB ఉచిత డేటా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
55
డేటా రీఛార్జ్ కిరికిరి లేదు
వ్యాలిడిటీ ఉంది కానీ డేటా అయిపోయింది…ఈ సమస్యను ఎదుర్కొనే వారు బోనస్ డేటా లభించే ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల డేటా గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్నేహితులకు, ఇతరులకు ఫోన్ చేసి డేటా రీఛార్జ్ చేయమని అడిగే టెన్షన్ తప్పుతుంది. నాన్ స్టాప్ గా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.