Jio Annual Plan: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.601కే ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ 5G డేటా!

Published : Jul 21, 2025, 07:07 PM IST

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రూ.601కే ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
14
జియో రీఛార్జ్ ప్లాన్..

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా రూ.601తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. తక్కువ ధరకే ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అయితే ఈ ప్లాన్‌కు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

24
జియో 5G డేటా..

రూ.601 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లకు అప్‌గ్రేడ్ లాంటిది. రోజుకు కనీసం 1.5GB హైస్పీడ్ డేటాతో యాక్టివ్ ప్లాన్ ఉండాలి. రూ.199, 239, 299, 319, 329, 579 వంటి ప్లాన్లతో ఈ వోచర్ పనిచేస్తుంది. 1,899 రూపాయల వార్షిక ప్లాన్ వాడుతున్న వారికి ఈ వోచర్ పనిచేయదు. 

34
రూ.601 రీఛార్జ్ ప్లాన్..

ఈ వోచర్ కొనుగోలుతో మీరు జియో నుంచి 12 నెలల 5G డేటా బూస్టర్‌లను పొందుతారు. ఇది ప్రతి నెలా యాక్టివేట్ అయ్యే వోచర్. ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది.

44
రూ.601 వోచర్‌ని ఎలా కొనుగోలు చేయాలి?

- జియో వోచర్ కొనుగోలు చేయడం చాలా సులభం.

- వోచర్ ని కొనుగోలు చేయడానికి  jio.com/gift/true-5g వెబ్‌సైట్‌ ని సందర్శించాలి.

- మీ జియో నెంబర్ లేదా మీరు గిఫ్ట్ చేయాలనుకుంటున్న వ్యక్తి నెంబర్‌ను నమోదు చేయండి. 

- చెల్లింపు పూర్తయిన వెంటనే.. వోచర్ యాక్టివేట్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories