Cyber security : ఆ యాప్స్‌ను వెంటనే తొలగించండి.. కేంద్రం హెచ్చరిక..

Published : Jul 21, 2025, 01:51 PM IST

Cyber security Alert:  రోజురోజుకూ టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. మనం ప్రతి పనికి సాంకేతికతపై ఆధారపడుతున్నాం. అయితే ఈ సమయంలోనే సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.

PREV
16
కేంద్రం హెచ్చరిక..

సోషల్ మీడియా, డిజిటల్ లావాదేవీలు పెరిగే సరికి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే ప్రమాదముంది. కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరస్థులు మోసాలు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం తరచూ హెచ్చరికలు జారీ చేస్తోంది. చాలాసార్లు వినియోగదారుల అవగాహన లోపమే ఈ మోసాలు జరుగుతున్నాయట.

26
సైబర్ నేరాలపై అప్రమత్తత

కొంతమంది అనుకోకుండా కొన్ని యాప్స్ కు అనవసరంగా యాక్సెస్ ఇస్తూ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరిక ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకరమైన యాప్‌లు తొలగించి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయవద్దని సూచిస్తోంది. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది.

36
ఆ యాప్‌లను తొలగించండి

ఇండియన్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు వెబ్‌సైట్ ప్రకారం.. చాలామంది తమ ఫోన్‌లలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే ఇలాంటి యాప్‌లు ఉంటే వెంటనే వాటిని తొలగించాలని కోరింది. ఇలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం  వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉంది. సైబర్  మోసాల నుంచి రక్షించుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొన్ని ప్రమాదకరమైన యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌ల నుండి తొలగించాలని  సూచించింది. అలాంటి యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయవద్దని స్పష్టం చేసింది.

46
యాక్సెస్ విషయంలో అప్రమత్తం

ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. యాక్సెస్ ఇచ్చే ముందు వాటిని వివరంగా చదివి, ఆ తరువాతనే వాటికి అనుమతి ఇవ్వండి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది. మీరు తెలియకుండా యాక్సెస్ ఇస్తే.. వారు మీ కార్యకలాపాలను ట్రాక్ చేయగలరు, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేయవచ్చు. కాబట్టి, ప్రతి అనుమతిని జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతేనే ఇవ్వండి. 

56
స్క్రీన్ షేరింగ్ యాప్‌ వల్లే ప్రమాదం

స్క్రీన్ షేరింగ్ యాప్‌ల వల్లనే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయంట. ఈ యాప్స్ వల్ల సైబర్ నేరస్థులు మీ OTPలు, బ్యాంక్ సందేశాలు, వ్యక్తిగత సమాచారం వంటి కీలక సమాచారాన్ని తెలుసుకోగలరు. కాబట్టి ఇటువంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, ఉపయోగించడం మానుకోండి. 

66
గోప్యత

ప్రభుత్వం తన సైబర్ క్రైమ్ పోర్టల్‌లో మరో సలహాను జారీ చేసింది. సోషల్ మీడియాలో వారి గోప్యతా సెట్టింగ్‌లపై దృష్టి పెట్టాలని వినియోగదారులను కోరింది. ఈ సెట్టింగ్‌లను మెరుగుపరచడం వల్ల, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, పోస్ట్‌లు ఇతరులకు చేరకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ చర్యల వల్ల సైబర్ నేరాల ప్రమాదం గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories