ISRO : అంతరిక్ష పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఇస్రో. అమెరికా వంటి అగ్రరాజ్యంలోని కంపెనీలు నాసాను కాదని ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి. తాజాగా మరో అమెరికన్ శాటిలైట్ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది ఇస్రో.
Blue Bird Block-2 : ఇస్రో... గ్లోబల్ స్థాయిలో ఈ ఇండియన్ స్పేస్ ఏజెన్సీ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో క్లిష్టమైన ప్రయోగాలను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన ఈ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతం చేసింది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ భారీ ఉపగ్రహాన్ని ఇస్రో సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపింది... ఇది కమర్షియల్ ప్రయోగమే అయినా అంతరిక్ష పరిశోదనల్లో దేశం ఏ స్థాయికి చేరుకుందో తెలియజేస్తోంది. అమెరికా కంపెనీ ఇస్రోకు తమ శాటిలైట్ బాధ్యతలు అప్పగించిందంటేనే ప్రపంచంలో మన సత్తా ఏంటో అర్థమవుతోంది.
25
ఏమిటీ బాహుబలి రాకెట్?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఖాతాలో ఇప్పటికే అనేక విజయాలు ఉన్నాయి... ఇందులోకి మరోటి చేరింది. అమెరికన్ సంస్థకు చెందిన 'బ్లూ బర్డ్ బ్లాక్-2' శాటిలైన్ ను నింగిలోకి మోసుకెళ్లింది 'LVM3-M6' రాకెట్. అయితే ఈ శాటిలైట్ కంటే దీన్ని సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి చేర్చిన రాకెటే మనకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇది భవిష్యత్ ఇండియా చేపట్టే మానవసహిత 'చంద్రయాన్' యాత్రకు ఉపయోగించే రాకెట్. ఇప్పటికే ఈ రాకెట్ ద్వారానే ఇస్రో చంద్రయాన్-3 మిషన్ ను పూర్తిచేసింది.
35
ఇస్రో ఇప్పటివరకు ఉపయోగించిన రాకెట్స్ ఇవే..
అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాలతో పోటీ పడుతోంది భారత్. ఇస్రో చేపట్టిన ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతోంది... ఈ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి లాంచ్ వెహికిల్స్ (రాకెట్స్). ఇప్పటివరకు ఇస్రో అనేక లాంచ్ వెహికిల్స్ ఉపయోగించింది... ప్రస్తుతం అత్యాధునికి LMV3 ఉపయోగిస్తోంది.
మొదట PSLV (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ను అంతరిక్ష ప్రయోగాల కోసం ఉపయోగించేది ఇస్రో. ఆ తర్వాత మరింత అధునాతన GSLV (జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ను రూపొందించింది. ప్రస్తుతం ఈ GSLV రాకెట్ ను మరింత శక్తిమంతంగా మార్చి LVM3 ని తయారుచేశారు. ఇది భారతదేశపు అత్యంత శక్తిమంతమైన రాకెట్. దీన్ని తాజాగా 'బ్లూ బర్డ్ బ్లాక్-2' వంటి శాటిలైట్స్ ప్రయోగానికే కాదు చంద్రయాన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలకు ఉపయోగిస్తోంది ఇస్రో.
అమెరికన్ సంస్థ AST Space Mobile కు చెందినదే ఈ 'బ్లూ బర్డ్ బ్లాక్-2' శాటిలైట్. దీన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుండి నింగిలోకి పంపించారు. ఏకంగా 6,100 కిలోల బరువును ఈ శాటిలైట్ ను బాహుబలి రాకెట్ గా పిలుచుకునే 'LVM3' మోసుకెళ్లింది. ఇంత భారీ శాటిలైట్ ను ఇస్రో మొదటిసారి ప్రయోగించింది... అందుకే బ్లూ బర్డ్ బ్లాక్-2 ప్రయోగంపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఇస్రో సక్సెస్ ఫుల్ గా శాటిలైట్ ను కక్ష్యలోకి చేర్చి మరో అరుదైన ఘనత సాధించింది.
'బ్లూ బర్డ్ బ్లాక్-2' శాటిలైట్ మొబైల్స్ కి నేరుగా హై-స్పీడ్ సెల్యూలార్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తుంది. అంటే మొబైల్ నెట్ వర్క్ ఉండని కొండకోనలు, ఎడారి ప్రాంతాలు, సముద్రాల మధ్యలో, దట్టమైన అడవుల్లో కూడా ఈ శాటిలైట్ సేవల ద్వారా ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. AST మొబైల్ కంపెనీ వివిధ మొబైల్ ఆపరేటర్లతో కలిసి ప్రపంచ నలుమూలల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆ శాటిలైట్ ను ప్రయోగించింది.
ఈ బ్లూ బర్డ్ బ్లాక్-2 శాటిలైట్ కక్ష్యలోకి చేరడం అమెరికన్ కంపెనీ సక్సెస్ అయితే... దీన్ని సక్సెస్ ఫుల్ గా LVM3 రాకెట్ మోసుకెళ్లడం మన విజయం. ఈ లాంచ్ వెహికిల్స్ నిప్పులుగక్కుతూ నింగిలోకి దూసుకెళుతుంటే భారతీయుల మనసులు ఉప్పొంగాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోను అభినందించారు. అంతరిక్ష రంగంలో దేశం అందనంత ఎత్తుకు ఎదుగుతోందని... ఇది 'ఆత్మనిర్భర్ భారత్' కు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
55
LVM3 ప్రయోగం సాగిందిలా...
యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'LVM3' ప్రయోగానికి ఇవాళ (బుధవారం) ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభయ్యింది. మొదట ఉదయం 8 గంటల 54 నిమిషాలకు 'బ్లూ బర్డ్ బ్లాక్-2' శాటిలైట్ తో 'LVM3' నింగిలోకి దూసుకెళ్లాలి. కానీ సాంకేతిక కారణాలతో 90 సెకన్లు ఆలస్యం అయ్యింది. ఈ సమయంలో అసలు ప్రయోగం జరుగుతుందా..? అనే ఆందోళన నెలకొంది.
అయితే సాంకేతిక సమస్యను సరిచేసి తిరిగి 8 గంటల 55 నిమిషాల 30 సెకన్లకు రాకెట్ ను ప్రయోగించారు. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ ఏకంగా 520 కిలోమీటర్ల ఎత్తులోకి శాటిలైట్ ను చేర్చింది. అనంతరం వ్యోమనౌక నుండి విడిపోయిన శాటిలైట్ కక్ష్యలోకి చేరింది.