స్టీల్ ప‌రిశ్ర‌మ‌లోనూ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌.. ఇగ్నిస్ AIతో ఇండస్ట్రియల్ ఇంటెలిజెన్స్‌

Published : Dec 23, 2025, 10:43 AM IST

Ignis AI: స్టీల్ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర మార్పుల దశలో ఉంది. వ్యయాలు పెరగడం, ముడి పదార్థాల ధరల్లో అస్తిరత పరిశ్రమను కొత్త పరిష్కారాల వైపు నడిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డావించీ సంస్థ రూపొందించిన Ignis AI ఒక కీలక మైలురాయిగా మారింది. 

PREV
15
ఇగ్నిస్ AI ఆవిర్భావం: స్టీల్ పరిశ్రమలో కొత్త ఆలోచన

స్టీల్ ప్లాంట్‌లో అత్యంత కీలకమైన ఫర్నేస్ ఇప్పటివరకు అనుభవం ఆధారంగా నడుస్తోంది. డేటా ఉన్నా, నిర్ణయాలుగా మారడం అరుదు. ఈ లోటును గుర్తించిన డావించీ, ఇగ్నిస్ AIను అభివృద్ధి చేసింది. ఫర్నేస్ డేటాను రియల్ టైమ్‌లో విశ్లేషించి, ఆపరేటర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఎనర్జీ వినియోగం నియంత్రణ, ఉత్పత్తి స్థిరత్వం, నష్టాల తగ్గింపు లక్ష్యంగా ఇది రూపుదిద్దుకుంది.

25
అమన్ రిజ్వీ ప్రయాణం: టెక్నాలజీ నుంచి ఇండస్ట్రీ దాకా

Ignis AI వెనుక ఉన్న ప్రధాన శక్తి డావించీలో ప్రొడక్ట్ అండ్ స్ట్రాటజీ హెడ్ అమన్ రిజ్వీ. ఫిన్‌టెక్, బ్యాంకింగ్, AI ఇంజినీరింగ్ రంగాల్లో ఆయన చేసిన పని ఈ ప్రాజెక్టుకు పునాదిగా నిలిచింది. అధిక నియంత్రణ ఉన్న వ్యవస్థల్లో పనిచేసిన అనుభవం వల్ల ఖచ్చితత్వం, నమ్మకం, స్కేలబిలిటీపై ఆయనకు స్పష్టమైన దృష్టి ఏర్పడింది. గతంలో ఒక టెక్ వెంచర్ నిర్మించి విజయవంతంగా ఎగ్జిట్ కావడం కూడా ప్రొడక్ట్ డిజైన్‌లో ప్రాక్టికల్ ఆలోచనలకు దోహదపడింది. ప్రస్తుతం IIM కలకత్తాలో కొనసాగుతున్న అకడమిక్ ప్రయాణం వ్యూహాత్మక ఆలోచనలకు మరింత బలం ఇస్తోంది.

35
ఫర్నేస్ డేటా నుంచి నిర్ణయాల వరకు

అమెరికా, యూరోప్, భారత్, మిడిల్ ఈస్ట్ ప్లాంట్లలో చేసిన అధ్యయనంలో ఒక విషయం స్పష్టమైంది. ఫర్నేస్ ప్రవర్తన ముందే అంచనా వేయగలిగినదే. అయినా ఆ సమాచారాన్ని సమర్థంగా వాడ‌లేదు. Ignis AI ఈ సమస్యకు పరిష్కారం చూపింది. టైమ్ సిరీస్ మోడలింగ్, అనామలీ డిటెక్షన్, రిఫ్రాక్టరీ లైఫ్ అంచనా, థర్మోడైనమిక్ డిజిటల్ ట్విన్స్ వంటి సాంకేతికతలు దీనిలో భాగం. ఫలితంగా ఆపరేటర్ నిర్ణయాలు డేటా ఆధారంగా మారుతున్నాయి. ఎనర్జీ నష్టాలు తగ్గుతున్నాయి. ఉత్పత్తి స్థిరత్వం మెరుగవుతోంది.

45
డావించీ ప్లాట్‌ఫామ్: అమెరికా నుంచి గ్లోబల్ మార్కెట్ దాకా

డావించీ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న AI-నేటివ్ MES ప్లాట్‌ఫామ్. CEO అర్వింద్ నెరెల్లా నేతృత్వంలో ఇది గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తోంది. Ignis AI ఈ ప్లాట్‌ఫామ్‌లో కీలక ఇంటెలిజెన్స్ మాడ్యూల్‌గా పనిచేస్తోంది. ఈ వ్యవస్థలో IoT, ఎడ్జ్ AI, అధునాతన MES మాడ్యూల్స్, బిల్లెట్ ట్రాకింగ్, మెటలర్జికల్ వర్క్‌ఫ్లోలకు అనుగుణంగా రూపొందించిన నిర్ణయ వ్యవస్థలు ఉన్నాయి. ఆపరేషన్ల డిజిటైజేషన్ మాత్రమే కాకుండా, నేరుగా నిర్ణయ ప్రక్రియలో ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టడం డావించీ ప్రత్యేకత.

55
తదుపరి అధ్యాయం: ఇండస్ట్రియల్ AIలో గ్లోబల్ వ్యూహం

Ignis AI విజయంతో డావించీ ఇప్పుడు గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇంటెలిజెన్స్ దిశగా ముందడుగు వేస్తోంది. GCC ప్రాంతాలు, భారత్, యూరప్ మార్కెట్లలో విస్తరణపై వ్యూహాత్మక ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఫర్నేస్ ఆపరేషన్లలో మానవ అనుభవానికి తోడుగా AI పనిచేసే దశకు పరిశ్రమ చేరుకుంటోంది. డావించీ తీసుకొస్తున్న ఈ మార్పు స్టీల్ రంగంలో ఉత్పాదకత, సస్టైనబిలిటీ, నిర్ణయ ఖచ్చితత్వం స్థాయిని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories