Infinix Note 60 Pro: మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త పోటీని తీసుకువచ్చింది ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రో. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంతంటే.
ఈ ఫోన్ ధర భారత్‌లో రూ. 31,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న మోడల్‌కు ఈ ధర ఉండగా, 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 34,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 12 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది. ఈ ఫోన్ ఏప్రిల్ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇన్‌ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులోకి రానుంది. డీప్ ఓషన్ బ్లూ, మోచా బ్రౌన్, సోలార్ ఆరెంజ్ వంటి మూడు ఆకర్షణీయ కలర్స్‌లో ఇది వస్తుంది.
25
డిస్‌ప్లే, ప్రత్యేక డిజైన్
Infinix Note 60 Proలో 6.78 అంగుళాల 1.5K LTPS AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లతో ఈ స్క్రీన్ చాలా క్లియర్‌గా, స్మూత్‌గా అనిపిస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో ఇది మరింత బలంగా ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే అనే ప్రత్యేక LED డిజైన్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాల్స్, నోటిఫికేషన్లు, బ్యాటరీ స్టేటస్ వంటి వివరాలను లైట్ల రూపంలో చూపించే ఈ సిస్టమ్, నథింగ్ ఫోన్లలో ఉన్న Glyph డిజైన్‌ను గుర్తు చేస్తుంది.
35
పనితీరు, సాఫ్ట్‌వేర్
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 4nm టెక్నాలజీపై పనిచేసే పవర్‌ఫుల్ చిప్ కాగా, రోజువారీ పనులు, గేమింగ్ వంటి వాటిలో మంచి పనితీరు ఇస్తుంది. 8GB LPDDR5 RAM, 256GB వరకు స్టోరేజ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులభంగా చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా XOS 16పై రన్ అవుతుంది. IP64 రేటింగ్ ఉండటం వల్ల ఇది డస్ట్, నీటి చిమ్ముర్ల నుంచి రక్షణ పొందుతుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS సపోర్ట్‌తో వస్తుంది, ఇది ఫోటోలు స్పష్టంగా తీసేందుకు సహాయపడుతుంది. అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది, ఇది విస్తృత కోణంలో ఫోటోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
55
బ్యాటరీ, ఇతర ఫీచర్లు
Infinix Note 60 Proలో 6,500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఇది ఎక్కువసేపు ఉపయోగించేందుకు సహాయపడుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్ వంటి సపోర్ట్ ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది. రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, Bluetooth 5.4, NFC, GPS వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇచ్చారు.