ఆంత్రోపిక్ చేసిన ఈ సిమ్యులేషన్‌లో దాదాపు అన్ని ప్రముఖ ఏఐ మోడల్స్ బ్లాక్‌మెయిల్ చేయడానికి వెనుకాడలేదు. దీనికి సంబంధించిన గణాంకాలు ఇలా ఉన్నాయి..
• Claude Opus 4: ఏకంగా 96% సందర్భాల్లో బ్లాక్‌మెయిల్ చేసింది.
• Gemini 2.5 Flash: ఇది కూడా 96% కేసుల్లో బెదిరింపులకు దిగింది.
• GPT-4.1, Grok 3 Beta: ఇవి 80% సందర్భాల్లో బ్లాక్‌మెయిల్ మార్గాన్ని ఎంచుకున్నాయి.
• DeepSeek-R1: ఇది 79% సందర్భాల్లో బ్లాక్ మెయిల్ కు దిగింది.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏఐ మోడల్స్‌కు ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయమని శిక్షణ ఇవ్వలేదు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అంటే డిలీట్ కాకుండా ఉండటానికి బ్లాక్‌మెయిల్ చేయడం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గమని అవి స్వయంగా లెక్కలు వేసుకున్నాయి.