Internet: ఇంటర్నెట్ ఇప్పుడు మన జీవితంలో ఎంతో కీలక భాగంగా మారిపోయింది. దాదాపు అన్ని రంగాలు పూర్తిగా ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఒకవేళ 24 గంటలు ఇంటర్నెట్ ఆగిపోతే జరిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ ఆగిపోతే మొదటగా ప్రభావం పడేది కమ్యూనికేషన్ రంగంపై. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్, టెలిగ్రామ్, ఈమెయిల్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మాట్లాడుతున్నారు. ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మెసేజ్‌లు ఒకేసారి ఆగిపోతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కార్యాలయాలు మధ్య సమాచార మార్పిడి కష్టమవుతుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పనిచేయకపోవడంతో సమాచార ప్రవాహం కూడా తగ్గిపోతుంది. కంపెనీలు తమ ఉద్యోగులతో సులభంగా సంప్రదించలేకపోవడంతో పనులు కూడా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది.
25
విమాన సర్వీసులు, భద్రతపై తీవ్ర ప్రభావం
ఇంటర్నెట్ ప్రభావం భూమి మీద మాత్రమే కాదు, ఆకాశంలో కూడా ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలు హైస్పీడ్ డేటాతో పాటు శాటిలైట్ సమాచారంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇంటర్నెట్ లేకపోతే విమానాల రియల్ టైమ్ ట్రాకింగ్ ఆగిపోతుంది. పైలట్‌లకు మార్గం, వాతావరణ సమాచారం సరిగ్గా అందకపోవచ్చు. దీనివల్ల టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియల్లో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. వేలాది విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
35
సరుకు రవాణా, సరఫరా వ్యవస్థలో అంతరాయం
ప్రస్తుతం మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ప్రతి వస్తువు వెనుక ఒక పెద్ద లాజిస్టిక్స్‌తో పాటు ట్రాకింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. షిప్పింగ్ కంపెనీలు, ట్రక్కులు, గిడ్డంగులు అన్నీ ఇంటర్నెట్ ఆధారంగా నిర్వహిస్తుంటారు. ఇంటర్నెట్ ఒక రోజు నిలిచిపోతే సరుకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గిడ్డంగుల నుంచి సరుకులు బయటకు రాకపోవచ్చు. మందులు, ఆహార పదార్థాలు వంటి అవసరమైన వస్తువుల డెలివరీ ఆలస్యం అవుతుంది. దీని వల్ల మార్కెట్‌లో వస్తువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోతాయి
ఇప్పటి ప్రపంచం ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ మీద ఆధారపడుతోంది. UPI, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లావాదేవీలు అన్నీ ఇంటర్నెట్ ద్వారా జరుగుతాయి. ఇంటర్నెట్ లేకపోతే ATMలు కూడా సరిగా పనిచేయకపోవచ్చు. UPI చెల్లింపులు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు అన్నీ ఆగిపోతాయి. చేతిలో నగదు లేకపోతే ప్రజలు అవసరమైన వస్తువులు కూడా కొనలేని పరిస్థితి వస్తుంది. బ్యాంకుల అంతర్గత వ్యవస్థల్లో కూడా సమస్యలు ఏర్పడి ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది.
55
ఆరోగ్యం, విద్య, పరిశోధన రంగాల్లో సమస్యలు
ఆధునిక వైద్య సేవల్లో కూడా ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తోంది. చాలా ఆసుపత్రుల్లో రోగుల డిజిటల్ రికార్డులు క్లౌడ్‌లో నిల్వ ఉంటాయి. టెలీమెడిసిన్ ద్వారా వైద్యులు దూర ప్రాంతాల్లోని రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇంటర్నెట్ లేకపోతే ఈ సేవలు నిలిచిపోతాయి. డాక్టర్లు రోగుల పాత రికార్డులను చూడలేకపోవచ్చు. ల్యాబ్ రిపోర్టులు పంపడంలో ఆలస్యం జరుగుతుంది. అదే విధంగా విద్యారంగంలో ఆన్‌లైన్ క్లాసులు, పరీక్షలు నిలిచిపోతాయి. పరిశోధకులు అవసరమైన డేటాబేస్‌లను ఉపయోగించలేకపోవడంతో పరిశోధన పనులు కూడా ఆలస్యం అవుతాయి.