Published : Aug 08, 2025, 08:57 PM ISTUpdated : Aug 08, 2025, 09:11 PM IST
Indian AI Model : ముగ్గురు యువకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అద్భుతాలు చేస్తున్నాయి. సరికొత్త ఏఐ మోడల్ తో టెక్ దిగ్గజాలకే సవాల్ విసురుతున్నారు. ఇంతకూ వాళ్లు రూపొందించి ఏఐ మోడల్ ఏమిటి? దాని ప్రత్యేకతలేంటో తెలుసా?
Artificial Intelligence : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఐదేళ్లకో, పదేళ్లకో ఓ విప్లవాత్మక మార్పు సంభవిస్తోంది. ప్రస్తుతం మనం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జమానాలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే ఏఐ రాకతో అనేక రంగాల్లో మార్పులు మొదలయ్యాయి... ఇది మనిషి ఆలోచనా శక్తిని మించిపోయే పనులు చేస్తోంది. ఇక భవిష్యత్ ఏఐదే అని గుర్తించిన టెక్ దిగ్గజాలు అనేక మోడల్స్ రెడీ చేశాయి. కానీ ఇండియాకు చెందిన ముగ్గురు యువకులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన AI మోడల్స్ తో పోటీకి దిగారు... సరికొత్త ఏఐ మోడల్ ను రూపొందించారు. అదే HelpingAI.
DID YOU KNOW ?
ChatGPT-5
చాట్ జిపిటి ద్వారా AI ని ప్రపంచానికి పరిచయం చేసిన ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా అడ్వాన్సుడ్ ఏఐ మోడల్ ChatGPT-5 ని రూపొందించింది.
25
HelpingAI ప్రత్యేకత ఏమిటి?
ఇప్పుడున్న సాంప్రదాయ AI మోడల్స్ అన్ని ఒకేలా పనిచేస్తాయి. వినియోగదారుడు అడిగే ప్రశ్నలు, సమస్యలకు ఇంచుమించు ఒకేలా సమాధానం ఇస్తాయి... చిన్న ప్రశ్నలకు కూడా ఎక్కువసేపు ఆలోచించి సమాధానం ఇస్తాయి. దీంతో కంప్యూటింగ్ శక్తి ఎక్కువ వినియోగించబడుతుంది… అలాగే కొన్నింటి వినియోగానికి అధిక వ్యయం అవుతుంది. అయితే HelpingAI ఈ పద్ధతిని మార్చింది. ఇది ప్రశ్నకు అనుగుణంగా వివిధ రీతుల్లో ఆలోచిస్తుంది.
HelpingAI సులభమైన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది. అదే కాస్త క్లిష్టమైన సమస్యలకు ఆలోచించి సమాధానం ఇస్తుంది... మరీ క్లిష్టమైన ప్రశ్నలకు బాగా లోతుగా ఆలోచించి, అవసరమైతే రెండోసారి సమీక్షించి జవాబు ఇస్తుంది. అంతేకాదు మధ్యలో తప్పులు గుర్తించి వెంటనే మార్పులు కూడా చేస్తుంది. ఇలా ఏ AI మోడల్ చేయని పని ఈ హెల్పింగ్ ఏఐ చేస్తుంది... అందుకే ఇది మిగతావాటితో ప్రత్యేకంగా నిలుస్తోంది.
35
HelpingAI పనితీరు
ఈ హెల్పింగ్ ఏఐ మోడల్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది చైనీస్ ఏఐ మోడల్ DeepSeek-R1 కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తోందని... OpenAI ChatGPT-4 కంటే సమర్ధవంతంగా పనిచేస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. అలాగే ఇది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా మానవ మెదడు ఆలోచనలకు తగ్గట్లుగా ఈ హెల్పింగ్ ఏఐ జవాబులు ఉంటున్నాయని చెబుతున్నారు.
అమెరికా వంటి దేశాలు AI టెక్నాలజీలో ఆదిపత్యం ప్రదర్శిస్తున్నాయి. వీటికి చైనా వంటి దేశాలు DeepSeek వంటి AI మోడల్స్ తో పోటీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ HelpingAI వంటివాటి ద్వారా భారత్ కూడా పోటీలోకి వస్తోంది. HelpingAI ఇండియన్ ఏఐ రంగానికి ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం కలిగి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
HelpingAI 10 వేల మంది సభ్యులతో కూడిన భారతీయ టెక్ కమ్యూనిటీని Redditలో నడుపుతోంది. ఈ AI మోడల్ ను మొదటి రోజు నుంచే ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి ఈ నెట్‌వర్క్ ఉపయోగపడుతోంది.
55
HelpingAI ను తయారుచేసిన యువకులు వీళ్ళే
1. HelpingAI చీఫ్ AI ఆఫీసర్ గా అభయ్ కౌల్ వ్యవహరిస్తున్నాడు. ఇతడు ప్రస్తుతం ఐఐటీ మద్రాస్‌లో డేటా సైన్స్ చదువుతున్నారు. ఇతడు ప్రతిభను అంతర్జాతీయ స్థాయి నిపుణులు గుర్తించారు.
2. HelpingAI CEO గా నిశిత్ జైన్ వ్యవహరిస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ఏఐ కమ్యూనిటీ (r/ai_india) మోడరేటర్, అనుభవజ్ఞుడైన ఏఐ నిపుణుడు.
3. HelpingAi CTO గా వరుణ్ గుప్త వ్యవహరిస్తున్నారు. మూడు నెలల్లోనే టెక్ ఏజెన్సీని ఆరు అంకెల ఆదాయ స్థాయికి చేర్చిన అనుభవం ఇతడిది. ఏపీఐ ఆధారిత ఉత్పత్తులలో మంచి నైపుణ్యం కలిగివున్నాడు.