Top 5G Phones Under Rs 15000: ఆగస్టు నెలలో రెడ్మీ, టెక్నో, ఐక్యూ, ఇన్ఫినిక్స్, సామ్ సంగ్ ల నుంచి రూ.15,000లోపు మంచి స్పెసిఫికేషన్స్ లో 5జీ ఫోన్లు విడుదల అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ లో రూ.15,000 వరకు ధర ఉన్న ఫోన్ మార్కెట్ అనేది మిడిల్-బడ్జెట్ వినియోగదారులకు కీలక విభాగం. 5G, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు వంటి వాటిని అందించే ఫోన్ల సంఖ్య ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం చాలా పెరిగింది. రూ.15,000లో 5G సపోర్ట్ ఉన్న బెస్ట్ ఫోన్లు చాలానే ఉన్నాయి.
DID YOU KNOW ?
5జీ నెట్‌వర్క్
5జీ అనేది 5వ తరం మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ. ఇది గత తరం నెట్‌వర్క్‌లైన 1జీ, 2జీ, 3జీ, 4జీలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేశారు. 5జీ అనేది మొబైల్ నెట్‌వర్క్‌లలో అత్యంత వేగవంతమైన, నమ్మకమైన, తక్కువ లేటెన్సీ గల నెట్‌వర్క్. 4జీలో 100 Mbps వరకు నెట్ వర్క్ స్పీడ్ ఉండగా, 5జీలో ఇది 1-10 Gbps వరకు ఉంటుంది.
26
1. రెడ్మీ నోట్ 14 SE 5G (Redmi Note 14 SE 5G)
రెడ్మీ నోట్ 14 SE 5G మోడల్ తాజాగా విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 2,100 నిట్స్ బ్రైట్‌నెస్, గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది.
టెక్నో పోవా 7 5G అనేది కొత్త పోవా 7 సిరీస్‌లో లోయర్-ఎండ్ వేరియంట్. ఈ హ్యాండ్‌సెట్ USP వెనుక భాగంలో కొత్త మల్టీ-ఫంక్షనల్ డెల్టా లైట్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. మీకు నథింగ్ ఫోన్‌లలో కనిపించే గ్లిఫ్ లైట్ల మాదిరిగానే ఉంటుంది. 144Hz రిఫ్రెష్‌రేట్ ఉన్న 6.78 అంగుళాల LTPS డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీతో ఇది వస్తుంది.