ప్రపంచంలో డాటా సెంటర్లు ఉపాధి అవకాశాల పరంగా అద్భుత ఫలితాలు అందిస్తున్నాయి. 2017–2021 మధ్య అమెరికాలో డాటా సెంటర్ ఉద్యోగాలు 20% పెరిగి 3.5 మిలియన్లకు చేరాయి, ఇది జాతీయ సగటు 2% వృద్ధి కన్నా చాలా ఎక్కువ. 2016–2023 మధ్య కాలంలో, డాటా సెంటర్లలో ఉద్యోగాల సంఖ్య 3,06,000 నుంచి 5,01,000కి చేరుతూ 60% వృద్ధి సాధించింది. ఈ ఉద్యోగాలు కేవలం సంఖ్యలో మాత్రమే కాక, వేతనాల పరంగా కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. డాటా సెంటర్ ఇంజనీర్ల వార్షిక వేతనం $100,000+ ఉండగా, నిర్మాణ దశలో పనిచేసే కార్మికులు కూడా మంచి వేతనాలు పొందుతారు. డాటా సెంటర్ల ప్రత్యేకత ‘మల్టిప్లైయర్ ఎఫెక్ట్’లో ఉంది. PwC అధ్యయనం ప్రకారం, ప్రతి డాటా సెంటర్ ఉద్యోగం సగటున 7.4 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. వీటిలో సప్లై చైన్, సర్వీస్ ప్రొవైడర్స్, టెలికమ్యూనికేషన్స్, HVAC నిపుణులు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలుంటాయి.