రూ. 21కే ఇయర్‌బడ్స్.. దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్ !

Published : Oct 17, 2025, 07:10 PM IST

Earbuds at Just 21 Rupees : భారతీయ కంపెనీ లావా దీపావళి సేల్‌లో కేవలం ₹21కే ప్రో ఆరియా 911 (Probuds Aria 911) ఇయర్‌బడ్స్ ను అందిస్తోంది. ఈ సూపర్ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇయర్ బడ్స్ ఫీచర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
లావా కంపెనీ దీపావళి స్పెషల్ ఆఫర్

భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ లావా (Lava) దీపావళి సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. చాలా తక్కువ ధరకు ఇయర్ బడ్స్ ను అందిస్తోంది. కంపెనీ ప్రకటించిన ప్రకారం, అక్టోబర్ 21న మధ్యాహ్నం 1:15 గంటలకు కేవలం ₹21 రూపాయలకే ప్రో బడ్స్ ఆరియా 911 (Probuds Aria 911) ఇయర్‌బడ్స్ ను సేల్ చేయనుంది. ఈ ఆఫర్ లావా అధికారిక ఇ-స్టోర్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

25
కేవలం 100 మంది వినియోగదారులకు మాత్రమే!

లావా తెలిపిన వివరాల ప్రకారం, ఈ దీపావళి ముహూర్తం సేల్‌లో మొత్తం 100 మంది కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలరు. అందువల్ల, ఈ ఆఫర్ కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి సిద్ధంగా ఉంటే మీరు కేవలం 21 రూపాయలకే ఇయర్ బడ్స్ ను కొనుగోలు చేయవచ్చు. 1:15 PM ను దీపావళి ముహూర్త ట్రేడింగ్ సమయంగా లావా పేర్కొంది.

35
Probuds Aria 911 ప్రధాన ఫీచర్లు ఏమిటి?

ప్రో బడ్స్ ఆరియా 911 మోడల్ డ్యూయల్ టోన్ డిజైన్‌లో అందుబాటులో ఉంది. ఇవి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 35 గంటల వరకు ఉపయోగించవచ్చు. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 150 నిమిషాల పాటు ప్లేబ్యాక్ అందిస్తుంది.

ఈ ఇయర్‌బడ్స్‌లో 10మిల్లీమీటర్ సౌండ్ డ్రైవర్లు, 35ms లో-లాటెన్సీ గేమింగ్ మోడ్, బ్లూటూత్ v5.3 కనెక్టివిటీ, టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

45
ప్రో బడ్స్ ఆరియా 911 లో నాయిస్ క్యాన్సిలేషన్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు

ప్రో బడ్స్ ఆరియా 911 లో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీ ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ను తగ్గించి కాల్స్ సమయంలో స్పష్టమైన వాయిస్‌ను అందిస్తుంది. ఇక IPX4 రేటింగ్ కారణంగా ఇవి వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను కూడా కలిగి ఉన్నాయి. దీనివల్ల వర్షపు చినుకుల సమయంలో కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు.

55
ప్రో బడ్స్ ఆరియా 911 పై యూజర్లు ఏమంటున్నారు?

కస్టమర్లు ఈ ప్రో బడ్స్ ఆరియా 911 ఇయర్‌బడ్స్‌ను సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ పరంగా మంచి డీల్స్ గా పేర్కొంటున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక రోజుకు పైగా ఉపయోగించవచ్చు. ఎలాంటి ఇబ్బందిని కలిగించకుండా పనిచేస్తుందని చాలా యూజర్లు తెలిపారు.

దీపావళి సందర్భంగా దేశీ కంపెనీ లావా వినియోగదారులకు ఇచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ₹21కే 35 గంటల బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఇయర్‌బడ్స్‌ను అందించడం అనేది వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories