ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ ఉన్న టాప్-8 దేశాల జాబితా చూస్తే ఆశ్చర్యపోతారు. అమెరికా, చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు ఈ లిస్టులో టాప్‌లో లేవు... ఏ దేశాలు ఉన్నాయో తెలుసా..?
రిలయన్స్ జియో ఎంట్రీతో ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందనే చెప్పాలి. మొదట్లో ఫ్రీగా అపరిమిత డేటా అందించడంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగింది... యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటివి ప్రజలకు బాగా చేరువయ్యాయి. జియో సునామీని తట్టుకునేందుకు ప్రత్యర్థి టెలికాం సంస్థలు కూడా ఇంటర్నెట్ డేటా ఛార్జీలు తగ్గించాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్ వాడుతున్న దేశాల్లో ఇండియా టాప్ లో ఉంది... కానీ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో మనం ఇంకా వెనకబడే ఉన్నాం. మరి జెట్ స్పీడ్ ఇంటర్నెట్ కలిగిన దేశాలేవి..? ఈ విషయంతో ఇండియా స్థానమెంత..?
27
1. యూఏఈ
అరేబియా ద్వీపకల్పంలో ఆగ్నేయంగా, పర్షియన్ గల్ఫ్ తీరంలో యూఏఈ ఉంటుంది. ఈ ఎడారి దేశం ప్రజల లగ్జరీ జీవనశైలికి, ఆకాశహర్మ్యాలకు ఫేమస్. ఇక్కడ సగటున 686.12 Mbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఇలా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశంగా యూఏఈ నిలుస్తోంది.
37
2. ఖతార్
సౌదీ అరేబియాతో సరిహద్దు పంచుకుంటున్న చిన్న ద్వీపకల్ప దేశం ఖతార్. ఇదికూడా ఎడారి దేశమే... కానీ ఇక్కడ చమురు నిల్వల కారణంగా బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగివుంది. రాజధాని దోహాలో అత్యాధునిక సౌకర్యాలు, లగ్జరీ జీవితాన్ని కలిగివుండే ప్రజలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ క్రమంలో ఈ దేశం మెరుగైన ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. సగటున 593.34 Mbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది... ఇలా ఖతార్ రెండో స్థానంలో ఉంది.
కువైట్ ఒక ఎడారి దేశం. ఇది అరేబియా ద్వీపకల్పానికి ఈశాన్యంలో ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్‌తో సరిహద్దులను పంచుకుంటుంది. సగటున 399.83 Mbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ప్రపంచంలోనే కువైట్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
57
4. బహ్రెయిన్
బహ్రెయిన్ పర్షియన్ గల్ఫ్‌లోని ఒక ద్వీప దేశం. కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా సౌదీ అరేబియాతో ఇది కనెక్ట్ అయి ఉంది. సగటున 332.04 Mbps ఇంటర్నెట్ వేగంతో, బహ్రెయిన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
67
5. బల్గేరియా
యూరప్ దేశమైన బల్గేరియాలో సగటు మొబైల్ ఇంటర్నెట్ వేగం 277.97 Mbps. ఈ జాబితాలో బ్రెజిల్ ఆరో స్థానంలో, దక్షిణ కొరియా ఏడో స్థానంలో, బ్రూనై ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాను ఊక్లా (Ookla) రూపొందించింది.
77
ఇంటర్నెట్ స్పీడ్ లో ఇండియా ర్యాంక్ ఎంత..?
ప్రపంచ దేశాలన్నీ వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం పోటీ పడుతున్నాయి. ఊక్లా (Ookla) రిపోర్ట్ ప్రకారం.. మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో భారత్ ప్రస్తుతం 133.51 Mbps సగటు వేగంతో ప్రపంచవ్యాప్తంగా 26వ స్థానంలో ఉంది. గత ర్యాంకింగ్‌తో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. ఇక అమెరికా 165.57 Mbps వేగంతో 14వ స్థానంలో ఉంది.