రానున్నది ఆర్థిక సునామి...
రాకపోతే సంతోషం !
వస్తే...గిస్తే ?
25- 30 ఏళ్లుగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు రైలు ఇంజిన్, చోదక శక్తి .. సాఫ్ట్ వేర్ .
టిసిఎస్ , ఇన్ఫోసిస్ , విప్రో .. ఇంకా ఎన్నో కంపెనీలు .
మాదాపూర్ , సైబరాబాద్ , బెంగళూరు , పూణే ... . ఇంకా ఎన్నో నగరాలు .
ప్రతి పది ఇళ్లల్లో కనీసం అయిదు మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు .
ఇండియాలో ..
అమెరికా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , కెనడా .. ఇంకా ఎన్నో చోట్ల
లక్షలాది కుటుంబాలు బువ్వ తింటున్నాయి అంటే సాఫ్ట్ వేర్ .
సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఆదాయం మీద ఎన్నో రంగాలు .. రియల్ ఎస్టేట్ , బ్యాంకింగ్ , ట్రావెల్ , టూరిజం , హోటల్స్ , మాల్స్ , ఫుడ్ కోర్ట్స్ , బ్యూటీ ప్రొడక్ట్స్ .. ఇంకా ఎన్నో .
ఇప్పుడు కృతిమ మేథ వచ్చేసింది .
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు .. ముఖ్యంగా కొత్తగా చేరిన వారు చేసే కోడింగ్ లాంటి పనులను కృతిమ మేథ చేసేస్తోంది .
ఉద్యోగులను తొలగించి కృతిమ మేథకు పని అప్పచెబితే కంపెనీలకు భారీగా లాభాలు .
ఇలాంటప్పుడు టీసీఎస్ , విప్రో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ లకు విదేశాలనుండి కాంట్రాక్ట్ లు ఎలా వస్తాయి ?
కాంట్రాక్ట్ లు లేకుంటే అవి ఉద్యోగులను తొలగించవా ?
ఉన్న పనిని కృతిమ మేథ తో పని చేయించవా ?
కృతిమ మేథ అనేక రంగాలను ప్రభావితం చేయనుంది .
కానీ ముందుగా దాని ప్రభావం పడేది సాఫ్ట్ వేర్ రంగం పైనే .
సాఫ్ట్ వేర్ కాంతులు మసక బడితే .. మన ఆర్థిక వ్యవస్థ సంగతి ఊహించండి .
ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ , ఇంకా దక్షిణ భారత దేశం .