Tech Tips: మొబైల్ ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా? మీ ఫోన్ గోవిందా!

Published : Oct 03, 2025, 12:25 PM IST

ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్ ని వాడుతున్నారు. 24 గంటలు ఫోన్ చూస్తూ కూర్చునే వాళ్లు కూడా లేకపోలేదు. అయితే చాలామంది ఫోన్ ని 100 శాతం ఛార్జ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

PREV
15
మొబైల్ ఫోన్

నేటి డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లల దగ్గరినుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కనిపిస్తోంది. ఫోన్ వాడకం మంచిదా చెడ్డదా అనే సంగతి పక్కన పెడితే.. చాలామంది మొబైల్ ఫోన్ ని 100కు 100 శాతం ఛార్జ్ చేస్తుంటారు. కాస్త తగ్గినా సరే.. తిరిగి ఛార్జింగ్ పెడుతుంటారు. నిజానికి ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేయడం వల్ల ప్రయోజనాల కంటే హానికరమైన పర్యవసానాలే ఎక్కువగా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

25
బ్యాటరీపై ఒత్తిడి

మనం ఫోన్‌ను 100 శాతం వరకు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువశాతం లిథియమ్-ఐయాన్ బ్యాటరీలు వాడుతుంటారు. వీటిని ఛార్జ్ స్థాయిలో ఎక్కువసేపు ఉంచితే, వాటి కెమికల్ నిర్మాణం నెమ్మదిగా దెబ్బతింటుంది. దీని వల్ల బ్యాటరీ కెపాజిటీ తగ్గిపోతుంది. ఈ మార్పు మీకు నెమ్మదిగా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఒక రోజంతా వచ్చే ఛార్జీంగ్.. రాను రాను 6, 7 గంటలకే పరిమితమవుతుంది. 

35
ఫోన్ వేడెక్కడం

ఎక్కువ ఛార్జ్ అవుతున్నప్పుడు ఫోన్ వేడెక్కడం మొదలవుతుంది. చాలామంది పడుకునే ముందు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి అలాగే పడుకుంటారు. ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా, అది ఛార్జింగ్ మోడ్‌లోనే కొనసాగుతుంది. దీని వల్ల బ్యాటరీలో వేడి పెరుగుతుంది. ఇది బ్యాటరీ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాదు ఫోన్ ఎక్కువగా వేడెక్కినపుడు డిస్ ప్లే పర్ఫామెన్స్ ప్రాసెసర్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

45
బ్యాటరీకి ఎఫెక్ట్

ఫోన్‌ను 0% నుంచి 100% వరకు ఛార్జ్ చేయడాన్నిఫుల్ ఛార్జ్ సైకిల్ అంటారు. ఒక స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సాధారణంగా 300 నుంచి 500 ఛార్జ్ సైకిళ్ల వరకే ఎక్కువగా పని చేస్తుంది. అంటే ప్రతిరోజూ మీరు 100 శాతం వరకు ఛార్జ్ చేస్తే, ఒక సంవత్సరం గడవక ముందే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. కాబట్టి ఫోన్‌ను 20% నుంచి 80% మధ్యలో ఛార్జ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

55
ఇలాంటి సందర్భాల్లో..

ఒకవేళ మీరు ఎక్కడికైనా ట్రావెల్‌ చేయాల్సి వచ్చినప్పుడో.. లేదా మీ వద్ద ఛార్జింగ్ సౌకర్యం లేనప్పుడో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోవడం మంచిది. అలాగే కొన్ని ముఖ్యమైన పనులు చేస్తుండగా బ్యాటరీ డెడ్ అయితే సమస్య అవుతుందని భావించిన సందర్భాల్లో కూడా 100 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ దాన్నే అలవాటుగా మార్చుకోవడం మాత్రం మంచిది కాదు.

Read more Photos on
click me!

Recommended Stories